నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆయన సోదరుడు రాజేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నపై వ్యతిరేక గాలి వీస్తోందని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో తన సోదరుడు ఓడిపోవడం ఖాయమని రాజేంద్ర పేర్కొన్నారు.ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం అభ్యర్థి మార్పుపై దృష్టి పెట్టాలన్నారు.
ఇందులో భాగంగానే ఎమ్మెల్యే ప్రసన్నకు కాకుండా టికెట్ ను ఆయన కుమారుడు రజత్ రెడ్డికి ఇవ్వాలని కోరారు.పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ప్రసన్న పక్కన పెట్టేశారన్న రాజేంద్ర ప్రసన్న చుట్టూ ఇప్పుడు టీడీపీ కోవర్టులు ఉన్నారని తెలిపారు.







