కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.కాగా గత ఏడాది ఓటీటీ లో రిలీజ్ అయినా జై భీమ్ సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో తెలుసు కదా, అయితే ఆ సినిమాతో పాటు పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, వెట్రిమారన్ తో ఇంకో సినిమా కూడా చేస్తున్నాడు.
అంతేకాదు సీరియస్ ట్రాక్ తో సాగే సినిమాలతో విసిగిన సూర్య కొంత విరామం తీసుకుంటున్నాడట.అయితే సూర్య భారీ బడ్జెట్ తో రాబోయే కమర్షియల్ ఎంటర్ టైనర్ కు సంతకం చేసినట్టు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం.
అంతేకాదు రజినీకాంత్ తో అన్నాత్తే సినిమా చేసిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట.అర్బన్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రంలో సూర్య మాస్ అవతారంలో కనిపించనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
మరి సూర్య నుంచి మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా చాలా కాలం తర్వాత వస్తుంది.మరి ఈ అప్ డేట్ తో సూర్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు .
కాగా ఈ సినిమాను దసరా సందర్బంగా షురూ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.అయితే ఈ సినిమాకు ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయనున్నారని తాజా సమాచారం.
అంతేకాదు ఈ స్టార్ హీరో మరో కొన్ని సినిమాలలో అతిథి పాత్రలలో కనిపించనున్నారని సమాచారం కూడా వినిపిస్తుంది.అయితే సూర్యకు అతిథి వేషాలు చేయటం ఇప్పుడేమి కొత్త కాదు.
అయన ఇది వరకే జూన్ ఆర్ , కుసేలన్ , `మన్మథన్ అంబు, క , అవన్ ఇవన్`, చెన్నైయిల్ ఒరు నాళ్ , `నినైదదు యారో, పసంగ 2`, కడైకుట్టి సింగం వంటి పలు తమిళ చిత్రాల్లో కూడా గెస్ట్ రోల్ చేసారు.అయితే ఈ సినిమాలలో కొన్ని తెలుగులోనూ అనువదించగా అక్కడ కూడా అవి అలరించాయి.

ఇక అసలు విషయానికి వచ్చినట్లైతే….ఇప్పుడు మళ్ళి అలాంటి గెస్ట్ రోల్ ను చేయబోతున్నట్లు తెలుస్తుంది.లోక నాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో విక్రమ్ పేరుతో సినిమా రూపొందుతున్నసంగతి అందరికి తెలిసిందే.అయితే లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా జూన్ 3న రిలీజ్ కానుండగా, ఇందులో పతాక సన్నివేశాల్లో తళుక్కున మెరవబోతున్నారనే వార్తలు వినిపించనుండగా, ఇక అలాగే జూలై 1న వివిధ భాషల్లో విడుదల కానున్న బయోగ్రాఫికల్ డ్రామా `రాకెట్రీః ద నంబి ఎఫెక్ట్` సినిమా లోనూ సూర్య కాసేపు కనిపిస్తున్నట్లు తాజాగా అందిన సమాచారం.
అయితే మాధవన్ టైటిల్ రోల్ లో నటించడమే కాకుండా.స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో మంచి ఆసక్తి కనపడుతుందనే చెప్పాలి.మరి.వరుస నెలలు అయిన జూన్, జూలై నెలల్లో రాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో సూర్య అతిథిగా ప్రేక్షకులను ఏ స్థాయిలో రంజింపజేస్తారో వేచి చూడాలి.







