ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్( Amazon ) కీలక ప్రకటన చేసింది.తమ కస్టమర్లకు అమెజాన్ భారీ గుడ్ న్యూస్ తెలిపింది.
ఇకపై అమెజాన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఏవైనా కొనుగోలు చేస్తే పాడైపోయిన లేదా డ్యామేజ్ ( Deteriorated or damaged )అయిన ప్రొడక్ట్స్ రావని స్పష్టం చేసింది.డెలివరీలు డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్ శనివారం వెల్లడించింది.
కస్టమర్లకు డెలివరీ చేసే వస్తువులు డ్యామేజ్ జరగకుండా, డ్యామేజ్ అయిన వస్తువులు డెలివరీ కాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence )సౌకర్యాన్ని ఉపయోగించుకోనుంది.

ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువును కస్టమర్లు కొనుగోలు చేసినప్పుడు అది వేరే ప్రాంతం నుంచి ట్రైన్లు లేదా ఇతర వాహనాల ద్వారా మీకు సమీపంలోని అమెజాన్ డెలివరీ సెంటర్‌కు చేరుకుంటాయి.అక్కడ నుంచి సేకరించి డెలివరీ బాయ్ ద్వారా మీ ఇంటికి వస్తుంది.అయితే ఇలా వచ్చేటప్పుడు చాలా వస్తువులు ప్యాకేజీలోనే పాడైపోవడం, పగిలిపోవడం, దెబ్బతినడం లాంటివి చోటుచేసుకుంటాయి.
గతంలో కస్టమర్లకు ఇలా దెబ్బతిన్న వస్తువులను డెలివరీ చేయడంతో చాలా విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో ఇలా జరగకుండా ఉండేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అమెజాన్ నిర్ణయించింది.ఈ టెక్నాలజీ ద్వారా దెబ్బతిన్న వస్తువులను గుర్తించి డెలివరీ కాకుండా ఆపుతారు.దీని వల్ల డ్యామేజ్ అయిన వస్తువులు కస్టమర్లకు చేరవు.
డ్యామేజ్ అయిన వస్తువులను గుర్తించి వాటి స్థానంలో కొత్త వస్తువులను పంపుతారు.ప్రస్తుతం అమెరికాలోని పలు వేర్‌హౌజుల్లో ఏఐ టెక్నాలజీని అమెజాన్ ఉపయోగిస్తోంది.
రానున్న రోజుల్లో అన్ని వేర్‌హౌజుల్లో ఈ టెక్నాలజీని వాడనుంది.దెబ్బతిన్న వస్తువులను గుర్తించంలో ఏఐ బాగా పనిచేస్తోందని, మనుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తున్నాయని గుర్తించారు.
దీంతో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే డెలివరీ సిస్టమ్‌లో నూతన మార్పులు వస్తాయని, కస్టమర్లకు మరింత మెరుగ్గా డెలివరీ చేయవచ్చని చెబుతున్నారు.







