సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణాభివృద్ధిపై భారీ నీటి పారుదల,సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్,అధికారులతో హైదరాబాదులో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కోదాడ పురపాలక సంఘంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టుటకు గాను తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయుఎఫ్ఐడిసి) ద్వారా రూ.20 కోట్లు,అమృత్ పథకం ద్వారా మంచినీటి సరఫరాకు రూ.25 కోట్లు,
శ్రీరంగాపురం,బాలాజీ నగర్ నందు రెండు అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లు నిర్మించుటకు రూ.2 కోట్ల 86 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.ఈనెల 23న మంజూరైన నిధులకు చేపట్టవలసిన పనులకు సంబంధించి శంకుస్థాపనకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.
పట్టణాభివృద్ధికి అవసరమైనన్ని నిధులు మంజూరు చేయిస్తానని మంచి ప్రణాళికతో అభివృద్ధి చేయాలని మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, కమిషనర్ రమాదేవి,పబ్లిక్ హెల్త్ డిఈఈ రమాదేవి పాల్గొన్నారు.