రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆయా గ్రామాల్లో మాఘ అమావాస్య పర్వదినాన్ని మండల ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ జరుపుకున్నారు.ఈ సందర్భంగా మండలంలోని ఎల్లారెడ్డిపేట శ్రీ లక్ష్మీ కేశవ పెరుమళ్ళ స్వామి ఆలయం తో పాటు రాచర్ల గొల్లపల్లి గాలం గుట్ట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అక్కపల్లి శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి ఆలయాలు బుధవారం భక్తజనులతో కిటకిటలాడాయి.
ఎల్లారెడ్డిపేటలోని శ్రీ లక్ష్మీ కేశవ పెరుమళ్ళ స్వామి ఆలయంలో అనువంశిక దేవాలయ అర్చకులు త్రివిక్రమ రామాచార్యులు మాధవాచార్యులు విష్ణుచార్యులు కేశవ చార్యులు విజయ్ చార్యులు అష్టభుజ కేశవ స్వామి వారికి విశ్వక్షేణ ఆరాధన లక్ష్మీ గౌరీ పూజ విష్ణు సహస్రనామాలు, పుణ్య వచనం బ్రహ్మ కలశపూజ స్వామికి అభిషేకం అంకురార్పణ అష్ట భుజ కేశవ స్వామి వారికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు.పాల్గొన్న భక్తజనులకు సిరా పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు.
ఆలయ కమిటీ చైర్మన్ పారిపెల్లి రామ్ రెడ్డి, కమీటి ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కమిటీ ప్రతినిధులు గంప నరేష్ మేగి నరసయ్య, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నంది కిషన్ , బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్కపల్లిలో మండలంలోని అక్కపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన పూరతన శ్రీ బుగ్గ రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం మాఘ అమావాస్య ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉదయం నుంచి భక్తులు ఆలయ ప్రాంగణంలోని నూతనంగా నిర్మించిన కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి పెద్దఎత్తున క్యూ కట్టారు.శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామిని ,
శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
ఉదయం నుంచే భక్తులు ఉపవాస దీక్షాలో వచ్చి పూజలు నిర్వహించారు.గ్రామస్తులు బుగ్గ శ్రీ రాజ రాజేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న భక్తకోటికి అన్న ప్రసాదం వితరణ పెద్ద ఎత్తున చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలు దుకాణాలు వెలిశాయి.ప్రతీ మాఘ అమావాస్య రోజున పెద్దఎత్తున జాతర నిర్వహించడం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి బుగ్గ వాసు శర్మ పంతులు అభిషేక పూజ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు, గోగూరి ప్రదీప్ రెడ్డి , చందర్ రావు , భూమిరెడ్డి , పో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , కోప్పుల రవింధర్ రెడ్డి, శంకర్ యాదవ్, జంకే లచ్చిరెడ్డి , భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
మండల ప్రజలు భక్తజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకాని స్వామివారి కృపకు పాత్రులయ్యారు, గాలంగుట్ట శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని గాలంగుట్ట శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా మాఘ అమావాస్య జాతర జరిగింది, గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు భక్తులు పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాల తరలిరాగా అత్యంత వైభవంగా జాతర జరిగింది.ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనము అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గుట్టపై సత్సంగం నిర్వహించారు.
హరే రామ హరే రామ రామ హరే హరే,హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే నామంతో ఆ గుట్ట రామనామ స్మరణతో మారుమోగింది.ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో భారీ ర్యాలీ గుట్ట వరకు నిర్వహించారు.
జాతరలో పాల్గొన్న గ్రామస్తులకు భక్తులకు గొల్లపల్లి గ్రామానికి చెందిన పాతూరి మల్లారెడ్డి పుష్పలత, వారి కుమారుడు నరసింహారెడ్డి, లావణ్య దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పొన్నవేని రాజు యాదవ్, వైస్ చైర్మన్ గోగూరి రాజిరెడ్డి కమిటీ సభ్యులు, మాజీ వార్డు సభ్యులు తిక్కయ్య గారి సత్తిరెడ్డి, గొర్రె మల్లేశం, పయ్యావుల రామచంద్రం, వంగల దేవయ్య, భూక్య ప్రకాష్ నాయక్,డైరెక్టర్లు మర్రి నారాయణ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, పందిళ్ళ సుధాకర్ గౌడ్, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు జబ్బర్ వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మండలంలోని ఆలయాలను బొప్పాపూర్ ఎఎంసి చైర్మన్ షేక్ సాబేరా బేగం గౌస్ బాయి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దోమ్మాటి నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి వైస్ ఛైర్మెన్ గుండాడి రాంరెడ్డి పట్టణ అద్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి , వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.జాతరలలో దొంగతనాలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎల్లారెడ్డిపేట పోలీసులు బందోబస్తు నిర్వహించారు.