రాజన్న సిరిసిల్ల జిల్లా: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తిపై, ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపిన సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ తేదీ:28.01.2025 రోజున ఎలాంటి అనుమతి లేకుండా ముస్తాబాద్ మండలం కొండాపూర్ శివారులోని మానేరు వాగు నుండి దొంగతనంగా చంద్రమౌళి అనే వ్యక్తి టిప్పర్ లో ఇసుకను అక్రమంగా రవాణ చేస్తుండగా పత్రిక విలేకరి గుండవేణి దేవరాజు అనే వ్యక్తి ఫోటోలో,వీడియోలు రికార్డ్ చేస్తుండగా పాక చంద్రమౌళి, అతని స్నేహితులు దేవరాజు ను ఫోటోలు వీడియోలు తీయవద్దని అడుగగా దేవరాజు అక్కడి నుండి పారిపోగా, పాక చంద్రమౌళి, అతని స్నేహితులు దేవరాజు ఇంటికి వెళ్లి దేవరాజు కుటుంబ సభ్యులను దేవరాజు తీసిన ఫొటోలు, వీడియో లు డిలీట్ చేయాలనీ లేకుంటే చంపుతాము అని బెదిరించగా,
గుండవేని దేవరాజు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా పాక చంద్రమౌళి అతని స్నేహితులు మీద కేసు నమోదు చేసి చంద్రమౌళిని అరెస్ట్ చేసి అతని టిప్పర్, లారి, వేగనార్ కార్ ని సీజ్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.అదేవిధంగా పాక చంద్రమౌళి తన ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను మానేరు వాగు నుండి తీసుక వస్తుండగా గుండవేని దేవరాజు తాను పత్రిక విలేకరి అని ఫోటో లు, వీడియోలు తీస్తూ తనకు 10,000/- రూపాయలు ఇవ్వాలని లేకుంటే ఆ ఫోటోలు, వీడియోలు జిల్లా ఎస్పీ,కలెక్టర్ల కు పంపుతాను అని బెదిరించడం జరిగిందని గతంలో కూడా ఇలానే బెదిరించగా చాల సార్లు డబ్బులు ఇవ్వడం జరిగిందని పాక చంద్రమౌళి పిర్యాదు మేరకు విలేకరి దేవరాజు పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.