రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో శుక్రవారం తలపెట్టిన పౌర హక్కుల దినోత్సవంకు అధికారులు రాకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల్ని చైతన్యం చేసి వారినీ సభకు హాజరయ్యేవిధంగా చూడకపోవడం వల్ల అక్కడున్నటువంటి దళిత ప్రజా సంఘాల నాయకులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు తెలియజేసి చైతన్యం చేయాల్సిన అధికారులే డుమ్మా కొట్టడం వల్ల వారి సమస్యలను వారి హక్కులను అసమానతలను ఎవరు ప్రజలకు తెలియజేస్తారనీ ప్రతి సమావేశాన్ని బహిష్కరిస్తున్న
ఈ సంవత్సరం కూడా అధికారులు అలాగే రాకపోవడం వల్ల నిర్లక్ష్యానికి వ్యతిరేకిస్తూ సివిల్ రైట్ ను బహిష్కరించడం జరిగిందన్నారు.
అలాగే గ్రామంలో, మండల కేంద్రంలో దళితుల అనిచివేత, అంటరానితనం అసమానతలు వంటి గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్న ఆ సమస్యల పైన అవగాహన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారికి హక్కులను తెలియజేస్తూ, అన్ని కులాల సమన్వయం చేస్తూ సమానత్వాన్ని పెంపొందించే కార్యక్రమం ఇది అని ఈ సమావేశాన్ని అధికారులే డుమ్మా కొట్టడం చాలా బాధ కరమని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి నాయకులు దోబ్బల నరేష్ , దొబ్బల స్వామియేలు, దళిత నాయకులు ఎరవేల్లి విజయ్, నరేష్ వంశీ, ప్రణీత్, తదితరుల పాల్గోన్నారు.