ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాసనసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వివాదాస్పదమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ పట్టణ సిఐ పి కరుణాకర్ హెచ్చరించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని, ప్రత్యర్థి రాజకీయ పక్షాలను లక్ష్యంగా చేసుకొని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

 Vemulawada Town Ci P Karunakar Warning On Social Media Posts, Vemulawada Town ,c-TeluguStop.com

ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫాములపై ఏ రకమైన అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా తక్షణమే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.ఎన్నికల సందర్భంగా తప్పుడు ప్రచారాలను చేయవద్దని, శాంతి భద్రతలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసే వారి పైన కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరిగే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించి సహకరించాలని సీఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube