టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం ( Chandrababu Skill Development Scam )లో అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన తనయుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara lokesh )తరచుగా ఢిల్లీకి వెళ్తున్నారు.చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత దాదాపు నెలరోజులు పాటు లోకేష్ ఢిల్లీలోని మకాం వేశారు.
ఇక చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చిన సమయంలో రాజమండ్రిలో ఉన్న లోకేష్ ఆ తర్వాత మళ్లీ ఢిల్లీకి వెళ్లి నిన్న సాయంత్రం తిరిగి వచ్చారు.దీంతో లోకేష్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు ? దానికి కారణాలు ఏమిటి అనే దానిపై వైసీపీ ఆరా తీస్తూనే వస్తుంది.కానీ సరైన క్లారిటీ మాత్రం రాలేదు.అయితే చంద్రబాబు కేసులపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు ఢిల్లీ కి లోకేష్ వెళుతున్నారు అని టిడిపి వర్గాలు చెబుతున్నా, లోకేష్ అంతకు మించిన వ్యవహారాలు ఏవో చక్కబెడుతున్నారని వైసిపి నాయకులు అనుమానిస్తున్నారు .
దీనికి తగ్గట్లుగానే టిడిపి తో సన్నిహితంగా మెలుగుతున్న వైసిపి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ కేసుల్ని ఇతర రాష్ట్రాలకు తరలించాలని కోర్టులో పిటిషన్ వేశారు.శుక్రవారం ఆ పిటిషన్ విచారణకు రాబోతూ ఉండడం తో జగన్ కేసులను ముందుకు తీసుకు వెళ్లే విధంగా రఘురామకృష్ణంరాజుతో కలిసి లోకేష్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేపట్టారని వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తుంది.చంద్రబాబు ను అరెస్ట్( Chandrababu arrest ) చేసిన కేసులో కనీసం ఆధారాలు కూడా చూపించలేకపోయారనే చర్చ జరుగుతుండగానే, న్యాయవర్గాలలోను ఈ అంశంపై లోకేష్ చర్చ పెట్టగలిగారు.
ఇక ఇదే విషయంపై జనాల్లోకి వెళ్ళేందుకు లోకేష్( Nara lokesh ) ప్లాన్ చేసుకుంటున్నారు .క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న జగన్ ( CM jagan )న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా సరికొత్త కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు .తరచుగా ఢిల్లీకి లోకేష్ వెళ్తుండడంతో ఆయన ఎక్కడెక్కడికి ఎందుకు వెళ్తున్నారనే విషయాలపై ఆరా తీసే పనిలో వైసిపి నిమగ్నం అయింది .ఏది ఏమైనా లోకేష్ ఢిల్లీ టు పై వైసీపీకి ఉన్న అనుమానాలు ఎన్నో ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయి.