పూరి జగన్నాథ్ వంటి వ్యక్తి ఇండస్ట్రీలో మరొకరు లేరు...ఎందుకో తెలుసా ?

పూరి జగన్నాథ్… తెలుగు తెరకు దొరికిన ఒక ఆణిముత్యం.సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.

 Unknown Facts About Director Puri Jagannath , Puri Jagannath, Director, Tollywoo-TeluguStop.com

అక్కడ ఎవరికి సక్సెస్ దొరుకుతుందో ఎవరిని ఫెయిల్యూర్ వెక్కిరిస్తుందో చెప్పలేని పరిస్థితి.సక్సెస్ అందుకున్న చోటే ఫెయిల్యూర్స్ కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది.

నిరాజనాలు అందుకున్న చోటే అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన పూరి జగన్నాథ్ కూడా ఒకానొక సమయంలో అప్పుల ఊబిలో కూరుకపోయాడు.

తన దర్శకత్వంలో హిట్ సినిమాలు కొట్టిన హీరోలు ఎవరు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి కూడా వచ్చింది.కానీ ఆయన ఒక పడి లేచిన కేరటం… అందుకే ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కున్నాడు.

మళ్ళీ అదే ఇండస్ట్రీలో సక్సెస్ లు కొడుతూ ప్రస్తుతం ఉవ్వెత్తిన ఎగిసి పడ్డదివ్వలా ముందుకు సాగుతున్నాడు.తెలుగు సినిమాలోని కాదు హిందీ సినిమాలో సైతం తనదైన మార్కును చూపించుకున్నాడు.

పునీత్ రాజ్ కుమార్ లాంటి హీరోని కన్నడ సినీ పరిశ్రమకు అప్పు చిత్రం ద్వారా పరిచయం చేశాడు.

Telugu Puri Jagannath, Tollywood, Vv Vinayak-Telugu Stop Exclusive Top Stories

తన పైన ఎన్నో రూమర్స్ వస్తున్నా ఏనాడు తలవంచి వాటి గురించి ఆలోచించలేదు.ఎంతో ధైర్యంగా మాట్లాడుతాడు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు.తను చేసే దానాల గురించి బయట ప్రపంచానికి తెలియనివ్వడు.

చాలామంది సినిమా ఇండస్ట్రీ వారిని మీకు తెలిసిన ఒక నిజాయితీపరుడు ఎవరు అని అడిగితే ఎక్కువ శాతం మంది చెప్పే మాట పూరి జగన్నాథ్. అలా ఎందరో అభిమానానికి పాత్రుడు కాగలిగాడు.

తన ముక్కుసూటి తనం, ఖచ్చితత్వం తో, మాటల తూటాలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలనే కాదు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.అందుకే వివి వినాయక్ లాంటి దర్శకులు కూడా మరో జన్మంటూ ఉంటే పూరీ లా పుట్టాలని కోరుకుంటున్నాను అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

అంతలా సాధారణ ప్రజలను కాకుండా, సెలబ్రిటీలను సైతం ఫ్యాన్స్ గా మార్చుకున్నాడు.ఇక లైగర్ వంటి పాన్ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాకు అద్భుతమైన ప్రమోషన్ లభించడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube