ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియనివారు ఈ ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తిలేదు.ఇక ప్రపంచంలోనే అత్యధికమంది యూజర్లు వాట్సాప్ సొంతం.
అందువలన వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల వ్యక్తిగత గోప్యతకు పెద్ద పీట వేస్తూ భారీ మార్పులు చేస్తూ ఉంటుంది.తాజాగా ఓ మూడు అప్డేట్స్ తీసుకువస్తోంది.
ఇందులో మొదటిది ‘ఆన్లైన్ స్టేటస్‌ను హైడ్ చేసే వీలు కల్పిస్తోంది’.గ్రూప్‌లో ఉన్న సభ్యులకు తెలియకుండా ఎగ్జిట్ అయ్యేలా కొన్ని మార్పులు, చేర్పులు చేస్తోంది.
అలాగే ‘వ్యూ వన్స్’ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసే అవకాశం లేకుండా చేస్తోంది.
ఈ ఫీచర్లను ఒకసారి వివరంగా చూస్తే, ఆన్లైన్ స్టేటస్ హైడ్ చేసే వీలు అంటే మనం ఆన్లైన్లో ఉన్నట్టు అందరికీ కనిపించాలా? లేక మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి మాత్రమేనా? లేక అసలు ఎవరికీ తెలియకుండా చేయాలా? అనే ఆప్షన్స్ మనం ఎంచుకోవచ్చు.ఈ కొత్త అప్డేట్ ఈ నెలలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.ఇక ‘వ్యూ వన్స్’ ఫీచర్‌ను కొంతకాలం క్రితం అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్.అంటే.మనం పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి చూశాక.
వెంటనే డిలీట్ అయిపోతుంది.అయితే.అది డిలీట్ అయిపోవడానికి ముందే స్క్రీన్‌షాట్ తీయడం వల్ల.‘వ్యూ వన్స్’ కాన్సెప్ట్‌కే అర్థం లేకుండా పోయింది.

అందుకే.ఇకనుండి ‘వ్యూ వన్స్’ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీయడానికి వీలు లేకుండా చేయనుంది.అలాగే ప్రస్తుతం మనం ఏదైనా వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వస్తే.ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది.ఫలానా వ్యక్తి ఎగ్జిట్ అయ్యారని గ్రూప్‌లో ఓ మెసేజ్ కనిపిస్తుంది.అలా జరగకుండా.
సైలెంట్‌గా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యే వీలు కల్పిస్తోంది.అలాగే ఇంకొక మంచి అప్డేట్ ఏమంటే, వాట్సాప్ గ్రూప్‌లలో మనం సభ్యులుగా వున్నపుడు వాటిలో ఉన్నవారిలో చాలా మంది మనకు తెలియని వారు కావచ్చు.
అలాంటి వారికి గ్రూప్ ఇన్ఫో చూడడం ద్వారా మన ఫోన్ నంబర్ తెలిసిపోతుంది.ఇకపై అలా జరగకుండా వాట్సాప్ మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ అప్డేట్స్ ఎప్పుడినుండి వస్తాయో ఇంకా అధికారిక ప్రకటన వెలువడనుంది.