ఏపీలోని టీడీపీ, బీజేపీ నేతలపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా మండిపడ్డారు.టీడీపీ సీనియర్ నేత యనమల స్థాయికి తగ్గట్లుగా వ్యవహారించడం లేదని తెలిపారు.
కాగ్ నివేదికలో పేర్కొన్న అంశాలను యనమల వక్రీకరించారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఏ ప్రాతిపదికన ఫోరెన్సిక్ ఆడిట్ అడుగుతున్నారో చెప్పాలన్నారు.
చంద్రబాబు హయాంలో అప్పుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.స్కిల్ సెంటర్లలో తూతూమంత్రంగా ట్రైనింగ్ ఇచ్చారన్న మంత్రి బుగ్గన కేంద్ర ప్రభుత్వ సంస్థలు హెచ్చరిస్తే ఏపీ ప్రభుత్వం మౌనంగా ఉండాలా అని నిలదీశారు.
స్కిల్ స్కాంలో ఏమీ నిరూపించలేదని టీడీపీ నేతలు ఎలా చెప్తారన్నారు.స్కాంలో ఏం జరిగిందో కోర్టుకు ఆధారాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.