రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో 33 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ నుండి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిచిన కళాధర్, కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్.
ఐ గా ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన కిషన్ రావు, కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ప్రస్తుత డిసిర్బీ లో విధులు నిర్వహిస్తున్నా సాంబాశివరావు లకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం.
ఈసందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం రోజున జిల్లాలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన సూపరింటెండెంట్ కళాధర్,ఏఎస్ఐ కిషన్ రావు, హెడ్ కానిస్టేబుల్ సాంబా శివరావు లను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సన్మానించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేషిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు మిగతా వారికి స్ఫూర్తిదాయకం అని,ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు.
పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు.
పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు.
తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాధర్ కుటుంబ సభ్యులు,కిషన్ రావు కుటుంబ సభ్యులు, సాంబాశివరావు కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.