పర్యావరణ ప్రేమికునికి మహానంది పురస్కారం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దుంపెన రమేష్ కు పర్యావరణ పరిరక్షణ తెలుగు వెలుగు ఉగాది మహానంది పురస్కారంకు ఎంపికయ్యారు.తెలంగాణ రాష్ట్రంకు చెందిన తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఎప్రిల్ 2న హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయగానసభలో పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమంలో అందుకోనున్నారు.

 Mahanandi Award For Environment Lover , Mahanandi Award , Dumpena Ramesh , Raja-TeluguStop.com

దుంపెన రమేశ్ తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవాసంస్థ వారు పర్యావరణ పరిరక్షణ ,సాహిత్య,సామాజిక సేవారంగంలో కృషికి గాను తెలుగు వెలుగు పర్యావరణ పరిరక్షణ మహానంది జాతీయ పురస్కారం కు ఎంపిక చేశారు.గత పదిహేను సంవత్సరాలుగా మొక్కల పంపిణీ, సంరక్షణ ,పర్యావరణ పరిరక్షణకోసం కృషి చేస్తున్నారు.

సాహితీ రంగములో చిగురు, గుమ్మడి పూలు, తులసి పుస్తకాలు రాశారు.

వేల ఆహ్వాన పత్రికలు, వందల రేడియో,టేపులు సేకరించి ప్రదర్శించాడు.

సామాజిక స్వచ్ఛంద సేవలు చేస్తున్న సాహితీ సేవల్ని గుర్తించి తెలుగు వెలుగు పర్యావరణ పరిరక్షణ సామాజిక ,సాహిత్య మహానంది పురస్కారంతో సత్కరిస్తున్న దుంపెన రమేశ్ ను బీ.ఆర్.ఎస్.జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి,ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజ్ యాదవ్, డా,జి.సత్యనారాయణస్వామి, వాసరవేణి పరశురాం,జనపాల శంకరయ్య,యమగొండ బాల్ రెడ్డి, చందనం మురళి, ఎ.రవి, కట్ల శ్రీనివాస్, గంప నాగేంద్రం, వాసరవేణి దేవరాజు,వెంగల లక్ష్మణ్, తదితరులు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube