రాజన్న సిరిసిల్ల జిల్లా : రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి ఉండనికి గుణ పెంకుల ఇల్లు తప్పా ఎలాంటి ఆస్తి పాస్తులు లేవు.కూలీ నాలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఇంటి పెద్ద దిక్కు దాసరి దేవయ్య గత మూడు సంవత్సరాలుగా టీబి వ్యాధి తో అనారోగ్యానికి గురై మంచం పట్టి టీబి మందులు వాడూతూ పనీ పాట లేకుండా ఇంటి వద్దనే ఖాళీగా ఉండిపోయాడు.
దీంతో అతని భార్య రజిత ఇద్దరు బిడ్డలు.మాయావతి, దేవిశ్రీ లను పోషించడం భారంగా మారింది.
అతని భార్య రజిత ఆ ఇంటికి పెద్దదిక్కుగా మారి కూలి నాలి చేస్తూ వచ్చిన డబ్బులతో అనారోగ్యం బారిన పడిన భర్తను ఇద్దరు ఆడ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివిస్తూ జీవనాన్ని సాగిస్తుంది.టిబి కాస్తా తగ్గిందో లేదో రెండు సంవత్సరాల కాలంగా కీళ్లవాతం తో దేవయ్య బాధపడుతున్నాడు, ఈ వ్యాధితో ఆయన నడవలేక పోతున్నాడు.
చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో సిరిసిల్ల సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాలలో 20 రకాల టెస్టులు చేపించుకున్నప్పటికీ బాగానే ఉన్నావని వైద్యులు చెబుతున్నారే కానీ కీళ్లవాతం నయం కావడంలేదని దేవయ్య ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతంలో ఉన్న బోధిధర్మ ఆయుర్వేద ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే
ఆయుర్వేద డాక్టర్ శ్రీనివాస్ పండిత్ పరీక్షలు చేసి మూడు నెలలో నిన్ను నడిపిస్తా లక్ష రూపాయల ఖర్చు అవుతుందని చెప్పాడని దేవయ్య విలేకరులకు తెలిపారు.చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఇంటికి వెను తిరిగి వచ్చానని దాతలు ఆర్థిక సాయం చేసి నన్ను ఆదుకుంటే లక్ష రూపాయల ఖర్చుతో నయం అవుతాననే ఆశ నాకు ఉందని దేవయ్య అతని భార్య రజిత పిల్లలు దాతల సహాయం కోసం చేతులెత్తి వేడుకుంటున్నారు.7 9 9 7 0 3 3 7 6 1 ఈ సెల్ నెంబర్ కు ఫోన్ పే ద్వారా గాని , గూగుల్ పే ద్వారా గాని ఆర్థిక సాయం చేసి తమ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని దాతలకు వారు విజ్ఞప్తి చేశారు.