రాజన్న సిరిసిల్ల జిల్లా : పట్టుదలతో విద్యార్థులు( Students ) చదివి తమ తల్లిదండ్రుల లక్ష్యం నెరవేర్చాలని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట( Yellareddipe ) జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు జూనియర్ కళాశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై శిక్షణ తరగతులు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా బుర్ర మధుసూదన్ రెడ్డి( Madhusudhan Reddy Burra ) పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పెంపొందించుకోవాలని తమ లక్ష్యసాధనకు కృషి చేయాలని విద్యతో ఎప్పటికప్పుడు పోటీ పడాలని పేర్కొన్నారు.తమ అలవాట్లను అభిరుచులను మార్పు చేసుకోవాలని తగు సూచనలు చేశారు అదేవిధంగా సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సాధన ప్రక్రియను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం జాతీయ అవార్డు గ్రహీతలు శ్యామంతుల అనిల్, దుంపెన రమేష్ లకు శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమాన్లు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, లయన్స్ క్లబ్ డిస్టిక్ క్యాబినెట్ మెంబర్స్ నంది కిషన్, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.