తెలంగాణ వీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ను ఆదర్శంగా తీసుకోవాలి.తెలంగాణ ప్రభుత్వం సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తుంది.

 Sardar Sarvai Papanna Goud Is A Symbol Of Telangana Heroism-TeluguStop.com

కలెక్టరేట్ లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ వీరత్వానికి పరాక్రమానికి ప్రతీక సర్వాయి పాపన్న అని, వారి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్అ న్నారు.ఆదివారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి నీ నిర్వహించారు.ఈ సందర్భంగా బిసి నాయకులు, గౌడ కమ్యూనీటి పెద్దల తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.జోహార్… అమర్ రహే పాపన్న గౌడ్….వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం అని నినందించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆయన పౌరుషాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు.బహుజన రాజ్యం కోరకు గోల్కోండ కోటను అధిరోహించి గోల్కోండ సింహసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేసారు.

ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ను ఆదర్శంగా తీసుకోని వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్, గోపజిల్లా కన్వీనర్ అమరేందర్ గౌడ్ లు మాట్లాడుతూ….

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం, పోరాట పటిమ ఎప్పటికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.

సర్దార్ పాపన్న గౌడ్ ఒక జాతికో, ఒక కులానికో పరిమితం కాదని ,సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అని అలాంటివారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, ముఖ్యంగా విద్యార్థులు సర్వాయి పాపన్న ఆశయాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఒక మంచి సంకల్పంతో పనిచేస్తే ఏ స్థాయికి అయినా వెళ్ళవచ్చు అని సర్దార్ సర్వాయి పాపన్న నిరూపించారని, వారి మార్గాన్ని ,వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలనీ వారు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, నాయకులు జగన్ గౌడ్, రమేష్ గౌడ్, దత్తాత్రి గౌడ్, మల్లేశం గౌడ్, లక్ష్మణ్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, భాస్కర్ గౌడ్, బాలరాజు గౌడ్, నరసయ్య గౌడ్, నాగరాజు గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, కృష్ణ ప్రసాద్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, పరశురాం గౌడ్, సత్యనారాయణ గౌడ్, నారాయణ గౌడ్, ప్రవీణ్ గౌడ్, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube