ఏబీవీపీ పోరాటంతోనే ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో ఏబీవీపీ నాయకులు డిగ్రీ కళాశాల ముందు, పాత బస్ స్టాండ్ లో బాణాసంచా కాల్చి,బైక్ ర్యాలీ నిర్వహించి, స్వీట్లు పంపిణీచేసుకొని సంబరాలు చేసుకున్న ఏబీవీపీ నాయకులు.ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఏబీవీపీ పోరాట ఫలితమే ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అయ్యిందని అన్నారు.

 Government Degree College Sanctioned In Ellareddypet With Abvp Struggle, Governm-TeluguStop.com

పోరాటాలతో సాధించుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సంబురాలు చేసుకుందాం అని కళాశాల వెళ్తే బి ఆర్ ఎస్ నాయకుల ఆదేశాలతో ఏబీవీపీ నాయకులు రాకుండా అడ్డుకున్న అధికారులు.నిన్నటి రోజున బి ఆర్ ఎస్ నాయకులు కళాశాల లో కేటీఆర్ కి పాలాభిషేకం ఎలా చేస్తారు?? వారికీ అనుమతి ఎలా ఇచ్చారు అని అన్నారు.డిగ్రీ కళాశాల కోసం ఏబీవీపీ నాయకులు పోరాటాలు చేసిన సందర్భములో ఎన్నో అక్రమ కేసులు లాఠీ చార్జీలు జైలు జీవితం ఎన్నో ఇబ్బందులు పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూసింది.కానీ ఎక్కడ భయపడకుండా విద్యార్థుల ఉద్యమలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సాధించుకున్నామని అన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం గత పది సంవత్సరల నుండి ఏబీవీపీ నాయకులు అనేక పోరాటాలు చేస్తున్నారు.దీనిలో భాగంగా నాయకులపైన అక్రమా కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందూలకు గురి చేసింది.

ఎల్లారెడ్డిపేట మండల విద్యార్థుల చిరకాల కాంక్ష అయినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

ఎల్లారెడ్డిపేట్ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల పేద బడుగు బలహీనత వర్గాల గిరిజన విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసి స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం తో ఎంతోమంది విద్యార్థులు డిగ్రీ చదువుకు దూరం కావడం జరిగింది.

నేడు డిగ్రీ కళాశాల ఏర్పాటు తో వేయిల మంది విద్యార్థుల జీవితలలో వెలుగులు వస్తాయనీ అన్నారు.పోరాటాలతో డిగ్రీ కళాశాల సాధించుకున్నాం.

డిగ్రీ కళాశాల ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందని మేము సాధించుకున్న డిగ్రీ కళాశాల లో అనుమతించకపోవడం బాధగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్,జిల్లా కన్వీనర్ అక్కేమ్ నాగరాజు, నాయకులు కొప్పుల నవీన్ రెడ్డి ,పెండ్యాల శివ, లోపెల్లి రాజు,తేజ,చందు, కిషన్,మహేష్,హరీష్,భరత్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube