రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఎంపీడీవో సత్తయ్య ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మౌనం పాటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
జనవరి 30, 1948 ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.
ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు.
సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు.
కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే నని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ రాజు, నవత సిబ్బంది పాల్గొన్నారు.