తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 22న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు.22న అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా సెలవు ఇవ్వాలని కోరారు.
రామ మందిర నిర్మాణనిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగంలో ఉందని బండి సంజయ్ తెలిపారు.ఈ నేపథ్యంలో దైవ కార్యాన్ని రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు.సెలవు దినంగా ప్రకటించి పవిత్రమైన దైవ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా చూడాలని తెలిపారు.హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో సీతారామచంద్ర స్వామివారిని ఆయన దర్శించుకున్న అనంతరం సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి విన్నవించారు.