ఈ భూమి పై ఉన్న ప్రతి ఒక్క మనిషి ఏ పని చేయాలన్నా అది అతని మూడ్ పై ఆధారపడి ఉంటుంది.అలాగే ఒక వ్యక్తి మూడ్ బాగుంటే అన్ని పనులు త్వరగా చేస్తూ ఉంటాడు.
కానీ మూడ్ బాగోలేదు అంటే అటు ఉన్న వస్తువు ఇటు పెట్టాలన్న ఏదో తెలియని చిరాకు, నిర్లక్ష్యం లాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి.అందరూ దీనికి బద్ధకం అని పేరు పెడుతూ ఉంటారు.
కానీ అసలు విషయం ఏమిటంటే మెదడు ఉత్సాహంగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.మెదడు ఉత్సాహంగా ఉండడానికి ,ఆక్సిటోసిన్, డోపమన్, ఎండార్పిన్ వంటి న్యూరోట్రాన్స్( Neurotrans ) మీటర్లు లోపం కారణం అని నిపుణులు చెబుతున్నారు.

కానీ శరీరంలో ఒత్తిడి హార్మోన్( Hormone ) అయిన కార్టిసాల్ ఎక్కువగా ఉంటే పై న్యూరోట్రాన్స్ విడుదల కావు.దీని వల్ల మెదడు పై ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.కానీ చాలా మంది ప్రజలు మెదడుకు శక్తి లభించడం కోసం పోషకాహారాలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్( Omega Three Fatty Acids ) లాంటి పోషకాహారాలు తీసుకుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ఆహారమే కాకుండా ఈ పనులు చేస్తే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలోకి వచ్చి మెదడు( Brain ) యాక్టివ్ గా మారుతుంది.
ఒక వ్యక్తికి ఇష్టమైన పనులు చేయడం వల్ల తృప్తి కలుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాగే అభిరుచి ఉన్న కార్యకలాపాలలో పాల్గొనడం డోపమైన్ విడుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రస్తుత సమయంలో సహజ కాంతిని పొందడం, ప్రకృతిలో సమయాన్ని గడపడం, వాతావరణంలో ఉండడం మొదలైన పనులు సెరోటోనిన్ హార్మోన్ను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ప్రేమ, ఆప్యాయత, దయ కలిగిన వ్యక్తులను కలవడం, వారితో కొంత సమయాన్ని కేటాయించి ఇతరులకు సహాయం చేయడం వంటివి ఆక్సిటోసిన్ విడుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.ఇంకా చెప్పాలంటే శరీరానికి ఉల్లాసాన్ని పెంచే వినోద భరితమైన కార్యక్రమాలు, వ్యాయామాలు ( Exercises )ఎండార్పిన్ విడుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.