ప్రస్తుతం ఏ చిత్ర పరిశ్రమలో అయినా వారసత్వమే సినీ రంగాన్ని ఏలుతోంది.ఒక్క హీరో కుటుంబం నుండి ఒక్కరి తరువాత మరొక్కరు ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉంటారు.
ఆలా వచ్చిన వారిలో స్టార్ హీరోలు మారిన వాళ్ళు ఉన్నారు.ఒక్కటి రెండు సినిమాలతో సరిపెట్టుకొని ఇండస్ట్రీకి దూరమైనా వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇప్పించేముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఇక మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక చిరుత మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, రెండో సినిమా మగధీర తో ఇండస్ట్రీలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.కాగా.ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్నారు.అయితే రంగస్థలం మూవీలో చిట్టిబాబు పాత్రలో చెర్రీ ఎంతలా ఒదిగిపోయాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక అన్ని రకాల హంగులతో ,అద్భుత నటనతో సినిమా ఆకట్టుకుంది.
అయితే ఇంతకీ ఎక్కడ నటన నేర్చుకుని ఉంటాడనే చర్చ రంగస్థలం తర్వాతే మొదలైంది.
కాగా.వైజాగ్ లో సత్యానంద్ దగ్గర పవన్ కళ్యాణ్,ప్రభాస్ వంటి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారంట.
ఇక ఆయన మంచి రచయితగా ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ అందించారు.ఇకపోతే చెర్రీ కూడా అక్కడే శిక్షణ తీసుకున్నాడని భావిస్తున్నారు.
కానీ.రామ్ చరణ్ ముంబైలో శిక్షణ తీసుకున్నాడని చాలామందికి తెలియదు.

బాలీవూడ్ నటుడు హృతిక్ రోషన్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు శిక్షణ పొందిన కిషోర్ నమిత కపూర్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ లో టాలీవుడ్ నటులు అల్లు అర్జున్,శర్వానంద్, ఆర్యన్ రాజేష్ లాంటి వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారంట.ఇక అలాంటి చోట చెర్రీ శిక్షణ తీసుకున్నారు.ఐయితే పాఠాలు నేర్చుకున్న చోటే నటించాలని హిందీలో జంజీర్ మూవీ చేశారు.ఈ సినిమా తెలుగులో తుపాన్ పేరుతొ విడుదలైన ఈమూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించారు.
కాగా.బాలీవుడ్ లో హిట్ కాకపోవడంతో ఇక టాలీవుడ్ కి పరిమితమైయ్యాడు.
ఇక సినిమాల్లో నటిస్తూ మరోపక్క నిర్మాతగా కూడా బిజీ అయ్యాడు రామ్ చరణ్.