ఆ ఘటన కి దేవర సినిమాకి సంబందం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ కొరటాల శివ( Director Koratala Siva ) అంటే అందరికీ తెలిసిన డైరెక్టర్ అనే చెప్పాలి ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఒక ఆచార్య సినిమాని మినహా ఇస్తే మిగితా అన్ని సినిమాలు కదా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి… ఈయన సినిమాలో సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలూ అయితే ఉంటాయి.కావాలంటే చూడండి తొలి సినిమా నుండి సమాజంలో ఏదో మార్పు కోసం ఆయన చేసే ప్రయత్నాలే కనిపిస్తుంటాయి.

 Ntr Devara Movie Story Line Inspired By Karamchedu Tragedy Details, Ntr, Devara-TeluguStop.com

ఈ క్రమంలో ఆయన సమాజంలో జరిగిన, జరుగుతున్న కీలక అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు.తాజాగా ఆయన ఎన్టీఆర్‌తో( Jr NTR ) తెరకెక్కిస్తున్న దేవర సినిమాలోనూ ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు అని తెలుస్తోంది…

భయానికి భయం పుట్టించే శక్తి లాంటి వ్యక్తి కథ ఇది అంటూ దేవర సినిమా( Devara Movie ) గురించి చెబుతున్నారు.

 Ntr Devara Movie Story Line Inspired By Karamchedu Tragedy Details, Ntr, Devara-TeluguStop.com

రక్తం పారుతున్న ఫొటోలు లుక్‌లో చూశాం.ఓ తీర ప్రాంతం / దీవి లాంటి ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది అని కూడా చెప్పేశారు.

అయితే ఇలా చెబుతున్నా.ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జరిగిన చాలా కీలకమైన ఓ అంశం గురించి ప్రస్తావించబోతున్నారు అని తెలుస్తోంది.

నేరుగా ఆ విషయం చెప్పకపోయినా.అప్పుడు జరిగిన అంశాల స్ఫూర్తితో ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయట…

Telugu Bapatla, Dalits, Devara, Koratala Siva, Jhanvi Kapoor, Ntr-Movie

దేవర సినిమాలో దళితులపై( Dalits ) జరిగిన క్రూరమైన హత్యాకాండ ఆధార సన్నివేశాలు ఉంటాయి అని అంటున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందిన కారంచేడులో జరిగిన విషాద ఘటనల ఆధారంగా కొన్ని సన్నివేశాలు ఉంటాయట.1985లో కారంచేడు గ్రామంలో( Karamchedu Village ) అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు.అందులోని కొన్ని అంశాలు ఇప్పుడు దేవర లో ఉంటాయని అంటున్నారు.అయితే అదే పేరుతో చూపిస్తారా అనేది చూడాలి…

Telugu Bapatla, Dalits, Devara, Koratala Siva, Jhanvi Kapoor, Ntr-Movie

మిర్చిలో ఫ్యాక్షన్ గొడవలు, శ్రీమంతుడు లో విలేజ్ అడాప్టేషన్, భరత్ అనే నేను లో రాజకీయాల్లో జవాబుదారీతనం, ఆచార్య లో నక్సలైట్ ఉద్యమాలను పొందుపరిచారు.ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’లో వర్ణాలు, వర్గాల మధ్య పోరు గురించి చూపిస్తారని అంటున్నారు.ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది…ఇక ఈ సినిమా హిట్ అయితే ఎన్టీయార్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇప్పటికే ఎన్టీయార్ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube