పెరిగిన దిగుబడితో దిగివస్తున్న టొమాటో ధర…కిలో @ రూ.25
TeluguStop.com
హైదరాబాద్/నల్లగొండ జిల్లా:టొమాటో కొంటే కాదు వింటేనే భయపడేలా ధర పలికింది.ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.
300,తెలుగు రాష్ర్టాల్లో రూ.200 టచ్ చేసిన కిలో టొమాటో ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతూ కిందికి ధర దిగి వస్తున్నది.
మరికొద్ది రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల టాక్.రాయలసీమలోని అనంతపురం,చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టొమాటో రావడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెప్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి,వికారాబాద్, మెదక్ నుంచి కూడా టొమాటో అధికంగా వస్తున్నది.
తాజాగా ఏపీలోని మదనపల్లె మార్కెట్‌లో టొమాటో ధరలు భారీగా తగ్గాయి.శుక్రవారం మార్కెట్‌కు దాదాపు 400 టన్నుల టొమాటో రావడంతో ధర మరింత పడిపోయింది.
మొదటి రకం టొమాటో కిలో రూ.30 నుంచి రూ.
40 పలికింది.రెండో రకం టొమాటో కిలో రూ.
21 నుంచి రూ.28 వరకు పలికింది.
పెళ్లి కూతురైన బిగ్ బాస్ బ్యూటీ… హల్దీ ఫోటోలు వైరల్…షాక్ లో ఫ్యాన్స్?