ఈ ఒక్కటి డైట్ లో ఉంటే మీ గుండెకు ఎటువంటి ఢోకా ఉండదు!

ఇటీవల రోజుల్లో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.ప్రతి ఏడాది గుండె పోటుతో( Heart Attack ) మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

 Best Smoothie For Heart Health Details! Heart Friendly Smoothie, Healthy Heart,-TeluguStop.com

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ ఉండ‌క‌పోవడం, కంటి నిండా నిద్ర లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు.గుండె జబ్బుల బారిన పడితే శారీరకంగానే కాదు ఆర్థికంగా కూడా చితికి పోతారు.

అందుకే సమస్య వచ్చాక బాధపడడం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ( Smoothie ) డైట్ లో ఉంటే మీ గుండెకు ఎటువంటి ఢోకా ఉండదు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ ( Oats ) వేసి వాటర్ పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి.

Telugu Brazil Nut, Flax Seeds, Tips, Healthy Heart, Heartfriendly, Heart, Heart

ఆ తర్వాత బ్లెండర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఓట్స్, రెండు వాల్ నట్స్,( Walnuts ) ఒక బ్రెజిల్ న‌ట్‌, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు,( Flax Seeds ) అర కప్పు వేయించిన ఫూల్ మఖానా వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన హార్ట్ ఫ్రెండ్లీ స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీ టేస్ట్ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Telugu Brazil Nut, Flax Seeds, Tips, Healthy Heart, Heartfriendly, Heart, Heart

ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.బ్యాడ్‌ కొలెస్ట్రాల్ ను కరిగించి గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.గుండెను ఆరోగ్యంగా మారుస్తుంది.కాబట్టి గుండె జబ్బులకు దూరంగా ఉండాలి అనుకునే వారు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.పైగా ఈ స్మూతీని రెగ్యులర్ గా తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది.

జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.ఎముకలు దృఢంగా మారతాయి.

హెయిర్ ఫాల్ సమస్య సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube