ప్రతి వ్యక్తి జీవితంలో ఓటమి, గెలుపునకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.సులువుగా సక్సెస్ సాధించిన వాళ్లతో పోల్చి చూస్తే ఎన్నో ఓటములను చవి చూసి కెరీర్ పరంగా ఎదిగిన వాళ్ల సక్సెస్ స్టోరీ( Success Story ) ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రస్తుతం ఐపీఎస్ ఆఫీసర్ గా( IPS Officer ) కెరీర్ ను కొనసాగిస్తున్న ఉమేశ్ గణపత్( Umesh Ganpat ) ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.విద్యార్థిగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలో ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిన ఉమేశ్ గుప్తా ఫెయిల్ అయినా ధృఢ సంకల్పంతో కెరీర్ విషయంలో ముందడుగులు వేశారు.
యూపీఎస్సీలో ( UPSC ) మంచి ర్యాంక్ సాధించి ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న ఉమేశ్ గణపత్ సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే ఒకింత ఆశ్చర్యానికి గురి కావాల్సి ఉంటుంది.మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఉమేశ్ గణపత్ పదో తరగతిలో మంచి మార్కులు సాధించి ఇంటర్ లో చేరగా 2003 సంవత్సరంలో ఇంటర్ ఇంగ్లీష్ లో 21 మార్కులు వచ్చాయి.
పరీక్షల్లో తక్కువగా మార్కులు రావడంతో ఉమేశ్ కు కొన్ని నెగిటివ్ కామెంట్లు ఎదురయ్యాయి.
అయితే ఫెయిల్ అయ్యాననే బాధను మరిచిపోయి ఫ్రెండ్స్ సహాయంతో ఉమేశ్ చదువుపై దృష్టి పెట్టాడు.తనకు తక్కువ మార్కులు వచ్చినా ఇంగ్లీష్ లిటరేచర్ లోనే డిగ్రీ పూర్తి చేయడంతో పాటు తర్వాత రోజుల్లో ఉమేశ్ ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేశారు.చదువుకునే సమయంలోనే ఎస్.
ఐ పరీక్ష రాసి ఉద్యోగం సాధించిన ఉమేశ్ ఆ తర్వాత యూపీఎస్సీ పరీక్షలు రాసి ఆ పరీక్షల్లో 704వ ర్యాంకును సాధించాడు.
డార్విన్ ఒకప్పుడు సాధారణ విద్యార్థి కాగా ఆ వ్యక్తి ఇప్పుడు మానవ పరిణామ క్రమాన్ని ప్రతిపాదించారు.తెలివి తక్కువ వాడని కామెంట్ చేసిన థమన్స్ అల్వా ఎడిసన్ ఇతరులు ఎవరూ చేరుకోని స్థాయికి ఎదిగారు.అదే విధంగా ఉమేశ్ కూడా ఒకప్పుడు అపజయాలు ఎదురైనా తన టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఉమేశ్ సక్సెస్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.