శోభిత దూళిపాళ్ల ( Sobitha Dulipala )ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.అయితే ఈమె తన సినిమాల కన్నా తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
శోభిత నటుడు నాగచైతన్యతో రిలేషన్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నటువంటి శోభిత ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేస్తున్న ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.
ఇలా నాగచైతన్యతో డేటింగ్ రూమర్లు వస్తున్న తరుణంలో ఈమె నాగచైతన్య సమంత గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
శోభితో తాజాగా ది నైట్ మేనేజర్ సీజన్ 2( The Night Manager Season 2 ) జూన్ 30న హాట్స్టార్ ఓటీటీలో విడుదల కానుంది.దీంతో ఆ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శోభిత నాగచైతన్య సమంత ( Samantha ) గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు.
ఈ సందర్భంగా సమంత గురించి మాట్లాడుతూ సమంత ఒక అద్భుతమైన నటి అని తెలిపారు.ఆమె సినిమాలో ఎంపిక చాలా అద్భుతంగా ఉంటుందని ఇక ఈ మధ్యకాలంలో ఎంతో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటుందని తెలిపారు.
ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్( Family Man 2 Series ) ఆమె సెలక్షన్స్ లో బెస్ట్ ఛాయస్ అని తెలియజేశారు.
ఇక నాగచైతన్య( Naga Chaitanya ) గురించి కూడా మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.నాగచైతన్య చాలా హుందాగా, , గౌరవంగా, కూల్ గా ఉంటాడు.వేరేవాళ్లతో మర్యాదగా ప్రవర్తిస్తాడు.
అతను అందరితోనూ మంచిగా ఉంటాడని తెలిపింది. ఈ విధంగా నాగచైతన్యతో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో శోభిత మాత్రం నాగచైతన్య సమంత గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.