1,000కి పైగా ఎయిర్ పోర్టులు వున్న దేశాలేమిటో తెలుసా?

సాధారణంగా ఒక దేశంలో ఎన్ని ఎయిర్ పోర్టులు( Airports ) ఉంటాయి? మీరు ఊహించింది నిజమే.ఏ పదుల సంఖ్యలోనో ఉంటాయి కదూ.

 Top Countries With More Than 1000 Airports America Brazil Canada Russia Details,-TeluguStop.com

మనదేశాన్నే తీసుకుంటే ఓ 35 ఎయిర్ పోర్టులు వరకు ఉంటాయి.వివిధ దేశాల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంటుంది.

వందల సంఖ్యలో ఉండడానికి ప్రతీ దేశము సంపన్న దేశం అయివుండాలి మరి.అయితే కొన్ని దేశాలలో వందల సంఖ్యలో కాదు… ఏకంగా వేలసంఖ్యలో ఎయిర్ పోర్టులు మనం చూడవచ్చు.అవును, మీరు విన్నది నిజమే.ఈ దేశాల్లో 1,000కి పైగా ఎయిర్ పోర్టులు.అత్యధిక విమానాశ్రయాలు వున్నాయి.ఇపుడు వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Ameica, Brazil, Canada, Latest, Maximum, Mexico, Russia-Latest News - Tel

ఇందులో మొదటగా పెద్దన్న ‘అమెరికా’( America ) గురించి మాట్లాడుకోవాలి.ఈ లిస్టులో అమెరికా మొదటి స్థానంలో ఉంది.ఒక్కో సంవత్సరానికి అమెరికాలోని 14,712 విమానాశ్రయాల ద్వారా మిలియన్ల మంది ప్రజలు పయనిస్తున్నారు.వాటిలో 102 అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలను అందిస్తున్నాయి.ఆ తరువాత చెప్పుకోదగ్గ దేశం బ్రెజిల్.( Brazil ) అవును, ‘బ్రెజిల్’ ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది.

బ్రెజిల్‌లో మొత్తం 4,093 విమానాశ్రయాలు ఉండగా 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.ఇక మూడవ దేశం ‘మెక్సికో.’( Mexico ) ఇక్కడ 1,714 విమానాశ్రయాలు కలవు.అందులో 36 అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలను అందిస్తున్నాయి.

Telugu Ameica, Brazil, Canada, Latest, Maximum, Mexico, Russia-Latest News - Tel

ఇక ‘కెనడా’ ( Canada )ఈ లిస్టులో నాల్గవ స్థానంలో ఉంది.కెనడాలో 1,467 విమానాశ్రయాలు కలవు.ఈ దేశం ఏడాది పొడవునా ప్రపంచం నలుమూలల నుంచి మిలియన్ల కొలదీ పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఈ లిస్టులో ఆఖరిది అంటే ఐదవది ‘రష్యా.’ ( Russia ) రష్యాలో మొత్తం 1218 విమానాశ్రయాలు ఉండగా అంతర్జాతీయ విమానాశ్రయాలలో విషయంలో రష్యా 2వ స్థానంలో ఉండడం కొసమెరుపు.ఇక్కడికి సంవత్సరానికి 80 మిలియన్లకు పైగా ప్రయాణీకులను రాకపోకలు సాగిస్తారని సర్వేలు చెబుతున్నాయి.

ఇక్కడికి ఇండియాకి ఎల్లపుడూ రాకపోకలు అనేవి జరుగుతూ ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube