ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు:ఎస్ఐ ముత్తయ్య
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మండల కేంద్రంలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను హుజూర్ నగర్ పోలీసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు.
ఎలాంటి అనుమతి లేకుండా మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
మూడు ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తుండగా పట్టుబడి చేసి AP 39 UR 4514,TS 29 TB 2578, TS29N4610 గల ట్రాక్టర్ డ్రైవర్లు బొడ్డు వెంకటేశ్వర్లు,గుగులోతు సైదులు,గొల్లగోపు శ్రీను,ఇసుక రవాణాకు సహకరించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.
ఎవరైనా సరే అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హిట్3 సినిమాతో నానికి నిర్మాతగా ఆ స్థాయిలో లాభాలా.. రిలీజ్ కు ముందే లక్కీ అంటూ?