ప్రజాపాలనపై పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్ష

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల అమలు నేపథ్యంలో నిర్వహించనున్న గ్రామ సభల్లో పోలీస్ భద్రత, రక్షణ ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు.జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 గ్యారెంటీ అమలు,ప్రతి పేదకు, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు,ఎస్పిలతో సమావేశం నిర్వహించి గ్రామసభలు,దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అధికారుల బాధ్యతలు, కార్యాచరణ అమలుపై దిశానిర్దేశం చేశారు.

 Sp Reviews Public Governance With Police Officers , Sp Office, Police Officers,-TeluguStop.com

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరు గ్యారంటీల అమలులో భాగంగా ఇప్పటికే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చినదని, కావున ఎక్కడా మహిళా వేధింపులకు జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ చేసుకోవాలి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.ఈ నెల 28వ తేదీ నుండి గ్రామ,పట్టణ,వార్డు సభల నిర్వహణకు ప్రభుత్వం కార్యాచరణ చేసిందని, దీనికి సంభందించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కలక్టర్ అధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేస్తున్నారని,సభల నిర్వహణలో ఎలాంటి భద్రత లోపాలు లేకుండా పోలీసు శాఖ పరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామాల్లో, పట్టణాల్లో సభల నిర్వహణ సమయంలో లైన్ పాటించేలా అధికారులతో సమన్వయంగా పని చేయాలన్నారు.గ్రామ సభల,పట్టణ,వార్డు సభలలో ప్రజలకు, అధికారులకు భద్రత కల్పించడం ముఖ్య విధి అని తెలిపారుఎవరైనా సమస్యలు సృష్టించే వారు ఉంటే అలాంటి వారిని గుర్తించాలని,పటిష్టంగా విజువల్ పోలీసింగ్ చేయాలని,లక్ష్యాల కోసం సమర్థవంతంగా పని చేయాలని,బ్లూ కొట్స్, పెట్రో కార్ పెట్రోలింగ్ పెంచాలని,రాత్రి సమయంలో సమయపాలన ఉండేలా ఎన్ఫోర్స్మెంట్ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో కోదాడ డిఎస్పీ ప్రకాష్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు రాజేష్, మహేష్,సీఐలు,ఎస్ఐలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube