ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోండి సారూ…!

ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోండి సారూ…!

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం బృందావనపురం గ్రామానికి చెందిన బొడ్డు ఆదిలక్ష్మి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్దం కావడంతో బొడ్డు ఆదిలక్ష్మి,ఇద్దరు కొడుకులు గోవర్ధన్,అనిల్,కోడలు మనీషా నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న విషయం తెలుసుకొని చలించిన తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అంజి యాదవ్ మంగళవారం గ్రామాన్ని సందర్శించి,బాధిత కుటుంబానికి రూ.

ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోండి సారూ…!

5వేల ఆర్ధిక సహాయం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలక్ష్మిది ఎంతో పేద కుటుంబమని, రోజువారి పనికి వెళ్తేనే కుటుంబం నడవటం చాలా కష్టమని, ఇల్లు కాలిపోవడంతో జీవితం అగమ్యగోచరంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు.

ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోండి సారూ…!

స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి ఆమెకు డబుల్ బెడ్ రూమ్ తో పాటు దళిత బంధు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ గోలి సునీత వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్,తెలంగాణ బీసీ సంఘం జిల్లా నాయకులు రాజశేఖర్ దేశినేని, కతిమాల వెంకన్న,తోకల మహేష్,గోలి ఎల్లయ్య, వెంకన్న,శేఖర్,లలిత, రామాంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

న్యాచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా.. ఆ రికార్డ్ ను అందుకుంటారా?

న్యాచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారా.. ఆ రికార్డ్ ను అందుకుంటారా?