ఏ రంగంలో అయినా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తేనే కెరీర్ లో ముందుకు వెళుతారు.ముఖ్యంగా సినిమా రంగంలో సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటనలో మరింత ఇంప్రూవ్ అవుతూ పోతే ఆడియెన్స్ మదిలో నిలిచి పోతారు.
మరి మన టాలీవుడ్ లో అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన నటనలో వేరియేషన్స్ చూపిస్తున్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.
ఈయన సినిమాలు మొదటి నుండి చుస్తే ఎవ్వరికైనా ఈ విషయం అర్ధం అవుతుంది.
ఈయన మొదటి నుండి కూడా డేరింగ్ స్టెప్పులు వేస్తూ ఆడియెన్స్ ను తన నటనతో అలరిస్తున్నాడు.మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబం అండదండలు దండిగా ఉన్నప్పటికీ ఈయన మాత్రం అటు వైపు చూడకుండా కేవలం నటన మీద, ఆయన ఎంచుకుంటున్న సినిమాల మీదనే ఆధారపడు తున్నారు.
ఈయన ప్రతి సినిమా కూడా ఒక ప్రయోగం అనే చెప్పాలి.చిన్న హీరో కదా ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని భయపడకుండా అన్ని సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈయన 2014 లి ముకుంద సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటికి ఆరేళ్ళు పూర్తి అయ్యి ఏడో సంవత్సరం జరుగుతుంది.ఈ ఆరేళ్లలోనే ఈయన మార్కెట్ 60 కోట్లు దాటింది.
అన్ని సినిమాలు కూడా 60 కోట్ల బిజినెస్ చేసుకునే స్థాయికి ఈ రోజు ఈయన ఎదిగాడు.
మరి ఇంత తక్కువ సమయంలో ఈయన 60 కోట్ల బిజినెస్ చేయగలిగే సత్తా చూపించడం ఆశా మాషీ కాదు.ఎందుకంటే ఈయన కంటే ముందు వచ్చిన స్టార్ హీరో కొడుకులు కూడా ఇప్పటి వరకు ఇంత మార్కెట్ సంపాదించు కోలేక పోయారు.
ఈయన ప్రెసెంట్ నటిస్తున్న సినిమా గని.

ఈ సినిమా ఇతడు రేంజ్ మరింత పెంచనుంది.దీని తర్వాత కూడా మరొక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు వరుణ్.ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని టాక్.
ఈయన సినిమాలకు 35 నుండి 45 కోట్ల మధ్య బడ్జెట్ అవుతుండగా బిజినెస్ మాత్రం 55-60 కోట్ల మధ్య ఉంటుంది.ఇలా ఈయన ముందు ముందు మరింత ఎదిగే అవకాశం కూడా ఉంది.







