బ్రెజిల్‌లో భారీ వరదలు.. పెంపుడు కుక్కలతో ఐక్యం కావడంతో యజమాని కన్నీళ్లు..

ఇటీవల బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రం భారీ వరదల వల్ల అతలాకుతలమైంది.ఈ భారీ వరదల కారణంగా వందకు పైగా ప్రాణాలు పోయాయి, ఎన్నో ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

 Owner Tears Up As Pet Dog Unites With Massive Floods In Brazil, Brazilian, Rio G-TeluguStop.com

ఈ విషాద ప్రకృతి విపత్తు కారణంగా ఎక్కడ చూసినా ఏడుపులు కన్నీరు పెట్టుకుంటున్న మనుషులే కనిపించారు.అయితే ఇలాంటి హృదయ విదారకమైన వృక్షాల మధ్య ఒక హార్ట్ టచింగ్ సంఘటన చోటుచేసుకుని చాలామంది దృష్టిని ఆకర్షించింది.

మనిషి-జంతువుల (Man-animal)మధ్య అనుబంధాన్ని చూపించే హృద్యమైన ఆ సంఘటన హాట్ టాపిక్ గా మారింది.దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో, వృద్ధుడు ఒకరు వరదనీటిలో పడవ మీద కూర్చుని ఉన్నారు.అతడు తన కుక్కలు చనిపోయాయేమో అని దిగులుగా కనిపించాడు.ఇంతలోనే ఆయన నాలుగు కుక్కలను రక్షించే తీసుకువచ్చారు కొంతమంది.ఆ కుక్కలను యజమాని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కౌగిలించుకున్నాడు.

ఈ వీడియో చూసి ప్రజలు చలించిపోయారు.

@goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఈ వీడియో షేర్ చేసింది.వరద బాధితుడు తన కుక్కలను మళ్లీ చూడడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.వరదలకు సహాయం చేసిన వాళ్ళు కూడా ఆ దృశ్యాన్ని చూసి వృద్ధుడిని ఓదార్చారు.

రియో గ్రాండే డో సుల్‌లో (riyo grande do sullo ) భారీ వర్షాలు వరదలకు దారితీసాయి.దీంతో వందల కొద్దీ పట్టణాలు నీట మునిగాయి, చాలా మంది నిరాశ్రయులు అయ్యారు, గాయపడ్డారు.

వీడియోను చూసిన ప్రజలు కామెంట్లలో తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు.కుక్కలు తమ యజమానితో తిరిగి కలిసినందుకు చాలా సంతోషించినట్లు కనిపించాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల(10 lakhs) దాకా వ్యూస్‌ సంపాదించింది.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మందిని కదిలించింది.

ప్రాంతం వరదల తరువాత ప్రభావితం అయింది, దాదాపు 400 మున్సిపాలిటీలు దెబ్బతిన్నాయి.వందలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది.

ప్రజల సహనానికి, రక్షకులు, పెంపుడు జంతువుల యజమానులు చూపించిన దయకు ఈ వీడియో ఒక సాక్ష్యం.కష్ట సమయాల్లో కూడా మానవత్వం ఎంతటి శక్తివంతమైనదో ఈ వీడియో చెప్పకనే చెబుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube