మెగా కుటుంబం పై వంగా గీత ఆసక్తికర వ్యాఖ్యలు..!!

పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత మెగా ఫ్యామిలీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ లో పాల్గొని.

 Interesting Comments Of Vanga Geetha On Mega Family, Ap Elections, Vanga Geetha,-TeluguStop.com

మెగా ఫ్యామిలీతో తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని స్పష్టం చేశారు.

రాజకీయాలు పక్కన పెడితే మెగా కుటుంబ సభ్యులు అంటే చాలా గౌరవమని చెప్పుకొచ్చారు.అలాగే వాళ్ళకి కూడా తన పట్ల గౌరవం ఉందని వంగా గీత(Pawan Kalyan) పేర్కొన్నారు.

అందువల్లే పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలకు ఎక్కడ చోటు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.ఏపీ ఎన్నికల బరిలో భాగంగా పిఠాపురం నుండి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేయడం జరిగింది.

ఇదే నియోజకవర్గంలో నుండి వైసీపీ (YCP)అభ్యర్థిగా వంగా గీత.పోటీ చేయటంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ ఎలక్షన్ లో వైసీపీ(ycp) గెలిచి పిఠాపురంలో వంగా గీత గెలిస్తే మాత్రం ఆమెకు ముందుగానే డిప్యూటీ సీఎం పదవి జగన్ (Jagan)ఆఫర్ చేయడం జరిగింది.దీంతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అన్నది.ఉత్కంఠ భరితంగా మారింది.ఈసారి ఏపీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.ఎవరు అధికారంలోకి వస్తారన్నది చెప్పలేకపోతున్నారు.ఏపీ ఎన్నికల ఫలితాలపై బయట భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి.

కూటమి లేదా వైసీపీ రెండు పార్టీల మధ్య పోటాపోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.జూన్ 4వ తారీఖున ఫలితాలు వెలువడున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube