ఏపీలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన మూడు చోట్ల ప్రచార సభలకు హాజరుకానున్నారు.
ముందుగా సీఎం జగన్ మంగళగిరికి చేరుకోనున్నారు.ఈ క్రమంలో మంగళగిరిలోని పాతబస్టాండ్ సెంటర్ లో జరగనున్న ప్రచార సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
తరువాత నగరి మరియు కడపలో జగన్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.మధ్యాహ్నం చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న సీఎం జగన్ నగరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పుత్తూరులో నిర్వహించే ప్రచార సభలో పాల్గొననున్నారు.
తరువాత కడప( Kadapa )కు వెళ్లనున్నారు సీఎం జగన్.కడప నగరంలోని మద్రాస్ రోడ్డు పొట్టి శ్రీరాములు సర్కిల్ లో నిర్వహించనున్న ప్రచార సభకు హాజరుకానున్నారు.
కాగా సీఎం పర్యటన, ఎన్నికల ప్రచారం నేపథ్యంలో వైసీపీ( YCP ) శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.టీడీపీని ఎండగడుతూనే మరోవైపు ఐదేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.