ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రచారంలో స్పీడ్ పెంచారు.ఈ మేరకు ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు.
మక్తల్, షాద్ నగర్ (Maktal, Shad Nagar)మరియు గోషామహల్(Goshamahal) లో సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ నిర్వహించనున్నారు.ప్రచారంలో భాగంగా ముందుగా మక్తల్ కు వెళ్లనున్న సీఎం రేవంత్ సాయంత్రం 4 గంటలకు అక్కడ ఏర్పాటు చేస్తున్న జనజాతర సభలో పాల్గొంటారు.సాయంత్రం 5.30 గంటలకు షాద్ నగర్ (Shad Nagar) లో రోడ్ షో నిర్వహించనున్నారు.తరువాత సాయంత్రం 6.45 గంటలకు గోషామహల్ లో రోడ్ షో చేపట్టి కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.అనంతరం రాత్రి 8.30 గంటలకు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.