2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి( TDP ) ఏ జిల్లా నుంచి ఎక్కువ సీట్లు వస్తాయనే ప్రశ్నకు ఉమ్మడి కర్నూలు జిల్లా అని చెప్పడంలో ఎలాంటి సందేహం, సంకోచం అవసరం లేదు.టీడీపీ, ఆ పార్టీ నేతలు ఎంత కష్టపడినా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ పరువు పోవడం ఖాయమని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని తెలుస్తోంది.
ఒకటి లేదా రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ జిల్లాలో గట్టి పోటీ ఇస్తోందని మిగతా నియోజకవర్గాల్లో మాత్రం వార్ వైసీపీ సైడ్ అని భోగట్టా.
కర్నూలు, బనగానపల్లె నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండటంతో ఈ స్థానాల్లో టీడీపీ గెలిచే ఛాన్స్ కొంతమేర ఉందని మిగతా 12 స్థానాల్లో మాత్రం టీడీపీకి గెలుపుపై ఆశల్లేవని భోగట్టా.జిల్లాలో గెలుపు కోసం టీడీపీ ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేసింది.కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కంటే టీడీపీ నేతలు ఎక్కువ మొత్తం ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం.
అయినప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లా ఓటర్లు మాత్రం బాబు పాలన అనే మాట వింటే భయాందోళనకు గురవుతున్నారు.రాయలసీమకు బాబు ఏమీ చేయలేదని ఉమ్మడి కర్నూలుకు బాబు చేసిందేమీ లేదని ఓటర్లు చెబుతున్నారు.రాబిన్ శర్మ టీమ్ ( Robin Sharma )సైతం ఉమ్మడి కర్నూలులో టీడీపీ పుంజుకోలేదని సర్వే రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు దొరక్క ఓటర్లకు సైతం పరిచయం అభ్యర్థులకు టీడీపీ టికెట్ ఇచ్చింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి ఒక స్థానంలో గెలిస్తే గొప్ప అనే పరిస్థితులు ఉన్నాయి.ఉమ్మడి కర్నూలు జిల్లా( Kurnool )లో వైసీపీకి 12 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
వైసీపీ కనీసం 160 సీట్లలో విజయం దక్కే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.