ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ( AP Polling ) పూర్తై వారం రోజులు అవుతోందనే సంగతి తెలిసిందే.అయితే పోలింగ్ పూర్తైన తర్వాత ఏపీలోని ముగ్గురు నేతలపై ఎక్కువమంది బెట్టింగ్స్ కడుతున్నారని తెలుస్తోంది.
ఆ ముగ్గురు నేతలు లోకేశ్, రఘురామ కృష్ణంరాజు, షర్మిల కావడం గమనార్హం.ఈ ముగ్గురిలో గెలుస్తారని కొంతమంది బెట్టింగ్ కడితే ఓడిపోతారని మరి కొంతమంది బెట్టింగ్ కట్టడం గమనార్హం.
అయితే వైసీపీ నేతలు, అభిమానులు మాత్రం ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా గెలవడం కష్టమని కామెంట్లు చేస్తున్నారు.లోకేశ్( Lokesh ) మంగళగిరి నుంచి రఘురామకృష్ణంరాజు( Raghuramakrishna Raju ) ఉండి నుంచి పోటీ చేయగా షర్మిల( Sharmila ) కాంగ్రెస్ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం.
ఈ ముగ్గురు నేతలలో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయో ఎవరికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.
ఈ ముగ్గురు నేతలలో ఇద్దరు నేతలు గెలుపు కోసం ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏపీలో మాత్రమే తెలంగాణ, కర్ణాటకలో వీళ్ల గెలుపుపై భారీగా బెట్టింగ్స్( Bettings ) జరుగుతున్నాయి.డిపాజిట్ల విషయంలో, మెజారిటీ విషయంలో కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయని భోగట్టా.
ఈ ముగ్గురు నేతలు సైతం రిజల్ట్స్ విషయంలో టెన్షన్ పడుతున్నారు.
లోకేశ్, షర్మిలలకు ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు.రఘురామ కృష్ణంరాజు గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి ఆ తర్వాత జగన్ పైనే విమర్శలు చేశారు.లోకేశ్ గత కొన్నేళ్లుగా మంగళగిరిలో( Mangalagiri ) గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారు.
ఆయన కష్టానికి తగ్గ ఫలితం వస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఈ అభ్యర్థుల విషయంలో వందల కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.