టిల్లు క్యూబ్ సినిమాలో మరో ఇద్దరు హీరోలు జాయిన్ అవ్వబోతున్నారా..?

డీజే టిల్లు( DJ Tillu ) సినిమాతో తెలుగు లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సిద్దు జొన్నలగడ్డ.ఇక ఈ సినిమాతో ఆయన ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర కూడా వేసుకున్నాడు.

 Are Two More Heroes Going To Join Tillu Cube Movie, Siddu Jonnalagadda , Tillu C-TeluguStop.com

ఇక దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా రీసెంట్ గా టిల్లు స్క్వేర్( Tillu Square ) అనే సినిమా వచ్చింది.ఇక ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయన భారీ సక్సెస్ సాధించడమే కాకుండా 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోల్లో ఒకడిగా నిలిచాడు.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక టిల్లు క్యూబ్ సినిమాను కూడా చేయాలని చూస్తున్నాడు.ఇక దానికి సంబంధించిన కథను సిద్దం చేసే పనిలో సిద్దు జొన్నలగడ్డ ఉన్నాడట.ఇక సిద్దు తో పాటు మరొక ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమా లో భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో తేజ సజ్జాతో పాటు విశ్వక్ సేన్ కూడా భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Are Two More Heroes Going To Join Tillu Cube Movie, Siddu Jonnalagadda , Tillu C-TeluguStop.com

ఇక ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ టిల్లుగా మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు.మరి వాళ్ళిద్దరూ ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు అనేది కూడా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

ఇక ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టులతో పోల్చుకుంటే ఈ సినిమా మరింత మంచి కథతో ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా ఉంటుందని సినిమా యూనిట్ అయితే తెలియజేస్తుంది.ఇక ఇప్పుడు సిద్దు బొమ్మరిల్లు భాస్కర్, నందిని రెడ్డి లాంటి డైరెక్టర్ల డైరెక్షన్ లో సినిమాలను చేస్తున్నాడు.ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత టిల్లు క్యూబ్ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది…నిజానికి సిద్దు ఈ స్టేజ్ కి రావడానికి చాలా కష్టపడ్డాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube