టిల్లు క్యూబ్ సినిమాలో మరో ఇద్దరు హీరోలు జాయిన్ అవ్వబోతున్నారా..?

డీజే టిల్లు( DJ Tillu ) సినిమాతో తెలుగు లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సిద్దు జొన్నలగడ్డ.

ఇక ఈ సినిమాతో ఆయన ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర కూడా వేసుకున్నాడు.

ఇక దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా రీసెంట్ గా టిల్లు స్క్వేర్( Tillu Square ) అనే సినిమా వచ్చింది.

ఇక ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయన భారీ సక్సెస్ సాధించడమే కాకుండా 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోల్లో ఒకడిగా నిలిచాడు.

"""/" / ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక టిల్లు క్యూబ్ సినిమాను కూడా చేయాలని చూస్తున్నాడు.

ఇక దానికి సంబంధించిన కథను సిద్దం చేసే పనిలో సిద్దు జొన్నలగడ్డ ఉన్నాడట.

ఇక సిద్దు తో పాటు మరొక ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమా లో భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో తేజ సజ్జాతో పాటు విశ్వక్ సేన్ కూడా భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ టిల్లుగా మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు.మరి వాళ్ళిద్దరూ ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నారు అనేది కూడా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

"""/" / ఇక ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టులతో పోల్చుకుంటే ఈ సినిమా మరింత మంచి కథతో ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా ఉంటుందని సినిమా యూనిట్ అయితే తెలియజేస్తుంది.

ఇక ఇప్పుడు సిద్దు బొమ్మరిల్లు భాస్కర్, నందిని రెడ్డి లాంటి డైరెక్టర్ల డైరెక్షన్ లో సినిమాలను చేస్తున్నాడు.

ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాత టిల్లు క్యూబ్ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.

నిజానికి సిద్దు ఈ స్టేజ్ కి రావడానికి చాలా కష్టపడ్డాడు.

పురుషుల్లో జుట్టు రాలడాన్ని అడ్డుకునే ఉత్తమ చిట్కా ఇది.. డోంట్ మిస్..!