బండ్ల గణేష్ హీరోగా నటించిన "డేగల బాబ్జీ' మే 20 న విడుదల

తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా డేగల బాబ్జీ.ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు.

 Bandla Ganesh's 'degala Babji' To Release On May 20 , Degala Babji , Bandla Gan-TeluguStop.com

ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా.కూడా వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు.

తమిళ్ లో నేషనల్ అవార్డ్ పొందిన “ఉత్త సిరుప్పు సైజు 7” చిత్రాన్ని తెలుగులో .ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన చిత్రమే ‘డేగల బాబ్జీ’.వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 20 న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా

హీరో బండ్ల గణేష్ మాట్లాడుతూ.

ఒక రూమ్ లో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్.అలాంటి కథను నా భుజాన పెట్టి నాతో చేయించాడు దర్శకుడు వెంకట్ చంద్ర.

ఈ సినిమా నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా అవుతుంది.ఈ సినిమా తర్వాత నాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పెక్ట్ వస్తుంది.

ఈ రెస్పెక్ట్ కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను.సంగీత దర్శకుడు లైనస్ అద్భుతమైన మ్యూజిక్,రీ రికార్డింగ్ ఇచ్చాడు.

తమిళ్ లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసి నేషనల్ అవార్డు సాధించిన “ఉత్త సిరుప్పు సైజు 7” సినిమాను తెలుగులో నేను చెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి,హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు.

మే 20 న వస్తున్న ఈ సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను అన్నారు

దర్శకుడు వెంకట్ చంద్ర గారు మాట్లాడుతూ .బండ్ల గణేష్ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశాడు.సినిమా విడుదలైన తరువాత బండ్ల గణేష్ ఇంత బాగా నటించగలుగుతాడా అనేది సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతారు.లైనస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను అన్నారు.ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), కళా దర్శకత్వం: గాంధీ, కూర్పు: ఎస్.బి.ఉద్దవ్, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, కథ: ఆర్.పార్తిబన్, మాటలు: మరుధూరి రాజా, వైదేహి, సంగీతం: లైనస్ మధిరి, సమర్పణ: రిషి అగస్త్య, నిర్మాణ సంస్థ: యష్ రిషి ఫిలిమ్స్ దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube