టాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినిమాలలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా వెలుగొందుతోంది.అనుపమ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.ఈ మధ్య కాలంలో అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది.
ఇక అనుపమ సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు.ఆమె కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కనీసం నెలకు ఒక్కసారి అయినా అభిమానులతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ నిర్వహిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా అనుపమ మరొకసారి అభిమానులతో చిట్ చాట్ చేసింది.ఈ క్రమంలోనే అభిమానులు ఫ్యామిలీ ఫోటో పెట్టమని లేటెస్ట్ ఫోటోస్ పెట్టమంటూ అంటూ రకరకాలుగా ప్రశ్నలు వేశారు.

అలాగే అనుపమ తదుపరి సినిమాలు ఏంటి? ఫోన్ లో వాల్ పేపర్ ఏంటి అని ఒక నెటిజన్ ప్రశ్నించగా అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది.ఇంతలో మరొక నెటిజన్ వాట్సాప్ డీపీ ఏంటి? అని ప్రశ్నించగా వాట్సాప్ డీపీ పెట్టలేదు అని సమాధానం ఇచ్చింది అనుపమ.వెంటనే మరొక నెటిజన్ ఏకంగా అనుపమ వాట్సాప్ నెంబర్ కావాలి అని అడిగాడు.ఇక సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు సరదాగా రిప్లై ఇస్తూ.వాట్సాప్ నెంబర్ నాట్ ఫౌండ్ అంటూ సమాధానం ఇచ్చింది అనుపమ.ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇకపోతే అనుపమ ప్రస్తుతం బటర్ ఫ్లై, 18 పేజీస్, కార్తికేయ 2 లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.అంతే కాకుండా అనుపమ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోస్ అంటూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.