ఎమ్మెల్యే సైదిరెడ్డికి మున్సిపల్ చైర్ పర్సన్ ఝలక్

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి( Shanampudi Saidireddy ) సోమవారం రాత్రి ఊహించని షాక్ తగిలింది.

ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త గెల్లి రవి,చైర్ పర్సన్ గెల్లి అర్చన,21,22,24వార్డు కౌన్సిలర్లు గాయత్రి భర్త భాస్కర్,అమరబోయిన సతీష్,గుంజ భవాని భర్త విజయ్ ( Vijay )బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మూడో వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ ఎంపి,హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మున్సిపల్ చైర్ పర్సన్ నివాసానికి స్వయంగా వెళ్ళిన ఉత్తమ్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ పరిణామం హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీకి( BRS Party ) పెద్ద ఎదురు దెబ్బగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్,కాంగ్రెస్ కౌన్సిలర్స్ పాల్గొన్నారు.

అనుకుంతా పని చేసేసారుగా.. శ్రీవర్షిణికి తాళి కట్టిన అఘోరీ!