రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 76 వ గణతంత్ర దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు వివిధ వేషధరణలు వేసి అందరిని అబ్బురా పరిచారు.
స్థానిక అంగడి బజారు నుండి గాంధీ ఏరియా వరకు ర్యాలీ నిర్వహించి దేశభక్తి నీ చాటారు.గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు.
గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
బహుమతులకు గాండ్ల ఆంజనేయులు 6000 రూపాయలు అందించగా, స్వీట్ల పంపిణీ నేవూరి శ్రీనివాస్ రెడ్డి చేశారు.
ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్, స్కూల్ విద్యాకమిటి డైరెక్టర్ ఒగ్గు మహేష్ చంద్ర, కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నేవూరి రవీందర్ రెడ్డి,వెంకట నరసింహ రెడ్డి, నేవూరి సురేందర్ రెడ్డి, గాండ్ల ఆంజనేయులు,నూకల శ్రీనివాస్,మాజీ వార్డ్ మెంబర్ ఒగ్గు లక్ష్మి యాదవ్, కులేరు కిషోర్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.