రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కేక మహేందర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం కేటీఆర్ కు కేకే సవాల్ విసిరారు.
ఎన్నికల్లో మాజీ మంత్రి కేటీఆర్ తాను డబ్బు పంచనని మద్యం పంచనని పదేపదే చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఆ మాటకు కేటీఆర్ కట్టుబడి ఉంటే బుధవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ దగ్గర తాను సిద్ధంగా ఉంటానని మంత్రి సవాల్ ను స్వీకరిస్తే తాను కూడా అక్కడికి రావాలని సవాల్ విసిరారు కేటీఆర్ రాలేదంటే తాను మద్యం డబ్బు పంచడానికి సిద్ధంగా ఉన్నట్లు అంగీకరించడం జరిగినట్లు అవుతుందన్నారు.
ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని సిరిసిల్ల నియోజకవర్గం లో తన గెలుపు ఖాయమన్నారు.ఎక్కడికి వెళ్లినా తాను రెండుసార్లు ఓడిపోయానని తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు కేకే.
అనంతరం కోరుట్లపేట గ్రామానికి చెందిన 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గూడ విజయ్ రెడ్డి,మాజీ సర్పంచ్ సింహాద్రి, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు వంగ మల్లారెడ్డి, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.