యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,సతీమణి,బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనితతో కుటుంబ సమేతంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముందుగా శివయ్యకు అభిషేకం చేసి అనంతరం వీరభద్ర స్వామికి మొక్కలు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలు,ఆలేరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని,పాడి పంటలు సమృద్ధిగా పండాలని శివయ్యను వేడుకున్నారు.







