అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla )లో ప్రసవాలు  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాలనీ  జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( District Collector Anurag Jayanthi ) వైద్యాధికారును ఆదేశించారు.సాధారణ ప్రసవాలు పెంచేందుకు  తొలి కాన్పులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

 Deliveries Should Be Taken Place In Government Hospitals Says District Collector-TeluguStop.com

క్రమం తప్పకుండా పురోగతి పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అన్నారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో సంస్థాగత, సాధారణ ప్రసవాలు పురోగతి పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంస్థాగత ప్రసవాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
ఏఎన్సీ చెకప్ లపై దృష్టి సారించాలన్నారు.

ఏఎన్సీ చెకప్ లు షెడ్యూల్ ప్రకారం చేయాలన్నారు.మాతృత్వ మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.

బర్త్ ప్లానింగ్( Birth Planning ) పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఏప్రిల్ నెలలో మొత్తం ఎన్ని ప్రసవాలు జరిగాయని జిల్లా కలెక్టర్ వైద్యాధికారుల ను వివరాలు అడిగారు.

మొత్తం 512 ప్రసవాలు జరగగా 280 ప్రభుత్వ ఆసుపత్రులలో, 232 ప్రైవేటు ఆసుపత్రుల్లో  ప్రసవాలు జరిగాయనీ చెప్పారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఉన్నాయనీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలనీ జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అంబేద్కర్ నగర్ పరిధిలో గత నెలలో 60 శాతంకు పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.మెడికల్ అధికారులు అందరూ ప్రతీ నెల 80 శాతం కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా ప్రసవాలు జరిగేలా చూసుకోవాలన్నారు.
సిజేరియన్ ప్రసవాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో వైద్యులు రాత్రి వేళల్లో ఉండేలా విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు.విలాసాగర్, హన్మాజిపేట, అంబేద్కర్ నగర్, చీర్లవంచ, లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధిత ఎన్క్వాస్ మెటీరియల్ కోసం అవసరమయ్యే అంచనా వ్యయం వివరాలను సమర్పించాలన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్  108 వాహనాల నిర్వహణపై ఆరా తీశారు.108 సేవలు ప్రబావంతంగా అమలు అయ్యేలా చూడాలన్నారు.కంటి వెలుగు ద్వారా 2 లక్షల 25 వేల మందికి పైగా పరీక్షలు చేయడం జరిగిందన్నారు.

మిగిలిన వారికి షెడ్యుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్నారు.
ఆరోగ్య మహిళా కార్యక్రమం( Arogya Mahila Program ) 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  నిర్వహించడం జరుగుతుందన్నారు.

గత వారం 405 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వారిని గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితులపై సమీక్షించాలన్నారు.

టీబీ కేసుల నిర్ధారణ వేగిరం చేయాలన్నారు.శాంపిల్స్ టెస్టింగ్ పెండింగ్ లో ఉంచకుండా త్వరగా చేయాలన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి శాంపిల్స్ పంపించే వివరాలపై ఆరా తీశారు.ప్రతీ గురువారం టీబీ కేసుల కోసం శాంపిల్స్ సేకరించాలని సూచించారు.
అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై ఏఎన్ఎం లు, ఆశా లు క్షేత్ర స్థాయిలో ప్రభావంతంగా పని చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు.జిల్లా ఆసుపత్రి పైన నిర్మిస్తున్న అదనపు బ్లాక్ నిర్మాణ పనుల పురోగతినీ జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకు లను అడిగి తెలుసుకున్నారు.
ఈ నెలాఖర్లోగా భవన నిర్మాణం పూర్తి చేయాలన్నారు.వేములవాడలో ప్రాంతీయ ఆసుపత్రుల్లో నిర్మిస్తున్న సివిల్ వర్క్స్ పురోగతిపై ఆరా తీశారు.

డయాలసిస్ యూనిట్ జూన్ 2 కల్లా సిద్ధం చేయాలన్నారు.డీఈఐసీ ఏర్పాటు, సిబ్బంది నియామక ప్రక్రియ పై వివరాలు అడిగారు.
నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల ప్రగతిపై pr ఇంజనీర్ లను ప్రశ్నించారు.జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను త్వరితగిన పూర్తి చేయాలన్నారు.మిగిలిన ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇంజనీర్ లను ఆదేశించారు.ఆర్ & బి, పంచాయితీ రాజ్ శాఖల పరిధిలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు.

టెండర్ అయిన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
ఆగస్టు 15 కల్లా పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఉపవైద్యాధికారి డా రజిత, జిల్లా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రావు, డాక్టర్ మహేష్ రావు , పంచాయితీ రాజ్ ఈ ఈ సూర్య ప్రకాష్ , టి ఎస్ ఎం ఐ డి సి ఇంజనీర్ లు, మెడికల్ ఆఫీసర్ లు  తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube