వృత్తి నైపుణ్యాలను మరింత పెంచుకోవాలి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా సాయుధ దళాల వార్షిక పునర్ ఉచ్చరణ (మోబిలైజేషన్) ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ నందు సాయుధ ధళ పోలీసుల సమీకరణ కవాతు (మొబిలైజేషన్ పెరేడు)ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించి మొబిలైజేషన్ లో భాగంగా 14 రోజులుగా శిక్షణ తీసుకున్న పరేడ్,స్క్వాడ్ డ్రిల్,లాఠీ డ్రిల్,మాబ్ ఆపరేషన్ డాగ్ స్క్వాడ్ నందు పని చేస్తున్న జాగిలాల ప్రతిభను వీక్షించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సమీకరణ కవాతు (మొబిలైజేషన్ పెరేడు) ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సాయుధ దళ పోలీసులకు రెండు వారాలు శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నారు.

 Rajanna Sircilla Sp Akhil Mahajan Speech At Mobilization Parade,rajanna Sircilla-TeluguStop.com

ఇందులో భాగంగా ఆర్మ్ డ్ రిజర్వ్/ సాయుధ దళాలు యాన్యువల్ మొబిలైజేషన్ శిక్షణలో ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్, గార్డ్ మౌంటింగ్, మాబ్ఆపరేషన్,ఫైరింగ్,నాకబంది,పికెట్స్,విఐపిబందోబస్త్ డ్యూటీస్,ప్రిసనర్,క్యాష్ ఎస్కార్డ్స్,లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై శిక్షణనిచ్చామన్నారు.
పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని మారుతున్న పరిస్థితుల క్రమంలో సాయుధ దళ సిబ్బంది సైతం శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులలో కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పారు.

శాంతి భద్రతల పరిరక్షణ సమయంలో కోపం వచ్చినప్పటికి ఆవేశం ప్రదర్శించకుండా సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.ముఖ్యంగా విచక్షణ కోల్పోకుండా ప్రజల హక్కులను కాపాడుతూనే శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మనపైన ఉన్నదని గుర్తుంచుకోవాలని చెప్పారు.

ఎట్టి పరిస్థితులలోనూ పోలీస్ శాఖ ప్రతిష్ట, ప్రజలలో పోలీసుల పట్ల ఉన్న గౌరవం దిగజారకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందిపైనే ఉన్నదని చెప్పారు.

వీటన్నింటి కోసం ఏర్పాటు చేసే మోబిలైజేషన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ,శారీరక దారుఢ్యం సక్రమంగా ఉండేలా చూసుకోవడానికి ఈ మోబిలైజేషన్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది మొత్తం ఒకే దగ్గరకు వచ్చి శిక్షణా సమయంలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం మోబిలైజేషన్ ద్వారా కలుగుతుందని చెప్పారు.

వ్యాయామం, యోగా నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు విస్వప్రసాద్, రవికుమార్ ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్,యాదగిరి,సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, నవీన్ కుమార్, ఎస్.ఐ లు,ఆర్.ఎస్.ఐ కు ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube