గ్రామగ్రామం ఏనుగు వెళ్ళాలి -బడంపేట్ డిప్యూటీ మేయర్

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో గ్రామగ్రామాన ఏనుగు గుర్తును తీసుకెళ్లి ప్రజలకు పరిచయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బడంపేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.శనివారం దేవరకొండ పట్టణంలోని ఎస్ఎస్ మొబైల్స్ మరియు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభానికి వచ్చిన ఆయనకు బీఎస్పీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

 Village Elephant Must Go - Badampet Deputy Mayor-TeluguStop.com

ముందుగా చింతపల్లి మండల కేంద్రంలో డా”బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు.అనంతరం కార్యకర్తలతో సమావేశమైన ఆయన గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

అదేవిధంగా డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని,ఏనుగు గుర్తును ప్రజలకు పరిచేయం చేయాలని దిశానిర్ధేశం చేశారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఎర్ర కృష్ణ జాంభవ్,ఇంచార్జి రమేష్ నాయక్,చింతపల్లి మండల కన్వీనర్ చెన్నపాక నరేష్,నియెజకవర్గ అధ్యక్షులు ఎర్ర క్రృష్ణ,నియెజకవర్గ కార్యదర్శి నల్ల ప్రసాద్,ఇంచార్జీ రమేష్ నాయక్, సైదులు,ప్రకాశ్,నవీన్,శ్రీహరి,గణేష్,జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube