ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రాణిస్తున్న ప్రతి ఒక్క ప్రముఖ హీరో ‘వాళ్ళు’ చెప్పినట్టు వినాల్సి ఉంటుంది.లేకపోతే హీరోలకు కంపల్సరిగా వాళ్ళ చేతిలో శిక్ష పడుతుంది.
ఇంతకీ వాళ్ళు ఎవరంటే.సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్స్.
అవును, వెండితెరపై ఆకర్షణీయమైన తమ బాడీలు హీరోలు షో చేస్తున్నారు అంటే దాని వెనక ట్రైనర్స్ కృషి ఎంతో ఉంటుంది.స్టార్ హీరోలు ఫిజికల్ గా చేంజ్ అవ్వాలంటే ఎక్కువగా కష్టపడేది వారి ట్రైనర్స్ అని చెప్పుకోవచ్చు.
ధృవ సినిమా లో రామ్ చరణ్ అద్భుతంగా బాడీ బిల్డ్ చేయడానికి ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ అయిన రాకేష్ వడియార్ కృషి ఎంతగానో ఉంది.సుల్తాన్, దంగల్ సినిమాల్లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లకు రాకేష్ ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేశారు.
అయితే టాలీవుడ్ హీరోలకు పలు ఫిట్నెస్ ట్రైనర్లు బాగా ట్రైనింగ్ ఇచ్చి వారి బాడీలను స్ట్రాంగ్ గా మార్చారు.ఈ ఆర్టికల్ లో ఏ హీరోకి ఏ ట్రైనర్ శిక్షణ ఇచ్చారో వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్ ఫిజికల్ మేకోవర్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.కొద్ది నెలల క్రితం విడుదలైన ట్రైలర్ లో కండలు తిరిగిన రామ్ చరణ్ తన ఫిట్నెస్ లెవెల్స్ ని చూపించి వావ్ పంపించారు.అయితే ఫిట్నెస్ ట్రైనర్ రాకేష్ వడియార్ ఇచ్చిన శిక్షణ తోనే రామ్ చరణ్ అంతా బలంగా తయారు అయ్యారు.
చెర్రీ తన ప్రతి సినిమాకి రాకేష్ వడియార్ నే ఫిట్ నెస్ ట్రైనర్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు.మరి ఈ ఏడాదిలో విడుదలయ్యే ఆర్ఆర్ఆర్ సినిమాలో చెర్రీ తన సరికొత్త బాడీ టోనింగ్ తో ఎంతగా అలరిస్తారో చూడాలి.
ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న తారక్ కూడా సరికొత్త బాడీ లుక్ తో కనిపించి వావ్ అనిపించారు.జూనియర్ ఎన్టీఆర్ కి ఫారిన్ ఫిట్నెస్ ట్రైనర్ అయిన లాయిడ్ స్టీవెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు.మణికట్టు కి గాయం కావడంతో కొద్ది రోజులు పాటు రెస్ట్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత లాయిడ్ స్టీవెన్స్ శిక్షణ లో రెగ్యులర్ గా పాల్గొంటూ తన బాడీ ని బాగా టోన్ చేస్తున్నారు.ఇటీవల ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు.
ఇందులో తారక్ లెగ్ వర్క్ అవుట్ చేస్తూ కనిపించారు.ఆ వర్క్ అవుట్ ఎంత కష్టమైనదో వీడియో చూస్తేనే అర్థమవుతుంది.
ఇటువంటి ఎన్నో క్లిష్టమైన వర్కౌట్స్ లాయిడ్ స్టీవెన్స్ చేయిస్తుంటారు.అయితే ఈయన హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ కి కూడా ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేస్తుంటారు.
మజిల్ ఫిట్నెస్ ట్రైనింగ్ తోపాటు మెంటల్ ఫిట్ నెస్ పెంచడంలో లాయిడ్ స్టీవెన్స్ దిట్ట.
‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.మార్షల్ ఆర్టిస్ట్ పాత్రను పోషించడానికి విజయ్ దేవరకొండ చాలా కష్టపడుతున్నారు.నిజానికి ఇంతకుముందెప్పుడూ ఆయన లైగర్ సినిమా కోసం కష్ట పడినట్లు ఏ సినిమా కోసం కూడా కష్టపడలేదు.
కానీ ఫైట్స్ ఉండే ఈ సినిమాలో సూపర్ మాస్ గా నటించేందుకు విజయ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం తప్పనిసరి అయింది.అయితే ఆయన ఇప్పటివరకు థాయ్‌లాండ్‌లో 15 మంది డిఫరెంట్ ట్రెనర్స్‌తో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు.
మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ పాత్రను పోషిస్తున్నారు కాబట్టి 15మంది ట్రైనర్స్ దగ్గర శిక్షణ పొందాల్సి వచ్చింది.ఫిట్‌నెస్ విషయానికొస్తే.పాపులర్ ట్రైనర్ కుల్‌దీప్ సేథీ శిక్షణలో విజయ్ కండలు పెంచుతున్నారు.
వరుణ్ తేజ్ కూడా కఠినమైన ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.‘గని’ కి మూవీకి సంబంధించి బాక్సింగ్ ట్రైనింగ్‌ని ఇంగ్లండ్ బాక్సర్ డేవిడ్ టోనీ జెఫ్రిస్ వద్ద వరుణ్ తేజ్ తీసుకుంటున్నారు.గత ఏడాది మార్చ్, జూన్, జూలై నెలలోనే బాగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేసిన వరుణ్ తేజ్ ప్రస్తుతం తన ఫిట్నెస్ అవన్నీ మెయింటైన్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా సినిమాల్లోని పాత్రలలో జీవించడానికి స్టార్ హీరోలు బాగా కష్టపడుతూ తమ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.